'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఏపీ రిలీజ్ పై వర్మ పోల్!

Published : Apr 04, 2019, 08:27 PM ISTUpdated : Apr 04, 2019, 08:28 PM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఏపీ రిలీజ్ పై వర్మ పోల్!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైనప్పటికీ ఏపీలో మాత్రం విడుదల కాకుండా హైకోర్టు స్టే ఇచ్చింది.

దీంతో చిత్రబృందం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. సినిమా ఏపీలో విడుదల ఆలస్యం కావడంపై ట్విట్టర్ పోల్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నం చేశారు రామ్ గోపాల్ వర్మ.

''లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల ఆలస్యం కావడం వల్ల ప్రజలు కోపంగా, బాధగా ఉన్నారా..?'' అంటూ ట్విట్టర్ లో పోల్ నిర్వహించారు. ఈ పోల్ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లో దాదాపు ముప్పై వేల ఓట్లు పోలయ్యాయి. 

ఇందులో 75శాతం మంది సినిమా రిలీజ్ ఆలస్యం కావడం వల్ల కోపంగా, బాధగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 25 శాతం మంది మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపారు. 

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?