Ram Gopal Varma : ‘కొండా’ను ప్రజలు కోరుకుంటున్నారు.. ఎవ్వరూ ఆపలేరంటున్న కొండా సురేఖ, ఆర్జీవీ..

By team teluguFirst Published Jan 25, 2022, 10:58 PM IST
Highlights

సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘కొండా’ మూవీ ట్రైలర్ లాంచ్ రేపు ఉదయం 10:25 కు జరగనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నా... ట్రైలర్ లాంచ్ చేసి తీరుతామని కొండా సురేఖ, ఆర్జీవీ స్పష్టం చేశారు.

వరంగల్ కు చెందిన సీనియర్ పొలిటికల్ లీడర్ కొండా మురళీ - కొండా సురేఖ జీవితంలోని కొన్ని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘కొండా’. ఈ సినిమాను సెన్షెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతలుగా మల్లారెడ్డి, నవీన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే తొలుత ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తీస్తున్నారనే సమయంలో అసలు కొండా మురళీనే ఒప్పుకోరనే రూమర్లు అప్పట్లో నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ రామ్ గోపాల్ వర్మ కొండా దంపతులకు నచ్చజెప్పి, స్టోరీ లైన్ తెలిపి ఎట్టకేళలకు ఒప్పించాడు. 

ఇటీవల ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కొత్తలోనే మంచి ఆదరణ పొందాయి. అప్పటికే కొండా దంపతులకు వరంగల్ పరిధిలో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ మూవీ గురించి అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి తెలిసిపోయింది. ఆ తర్వాత వరంగల్ లో ‘కొండా’ మూవీ ప్రమోషన్ లో భాగంగా  వ్రాప్ అప్ పార్టీ సెలబ్రేట్ కూడా చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ అన్నల డ్రెస్ ధరించి చేసిన హంగమా అందరికి తెలిసిందే. ఈ మూవీని నుంచి రిలీజైన ‘భలే భలే’ సాంగ్ కూడా జనాల్లోకి వెళ్లింది. 

కాగా, ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్  రేపు ( జనవరి 26న) ఉదయం 10:25కి రిలీజ్ కానుంది. ఈ మేరకు  ‘కొండా’ ట్రైలర్ రిలీజ్ కాకుండా టీఆర్ఎస్ కు చెందిన  ప్రజాప్రతినిధులు దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని డైరెక్టర్ ఆర్జీవీ, కొండా సురేఖ ఆరోపించారు. అయితే ఈ రోజు రాత్రి కొండా రెసిడెన్సీ వద్దకు పోలీసును కూడా పంపించారని, మూవీ ట్రైలర్ ను ఆపేందుకు  ప్రయత్నిస్తున్నారని తెలిపారు.  

 

pic.twitter.com/NmSznqsAu0

— Ram Gopal Varma (@RGVzoomin)

ఈ మేరకు కొండా సురేఖ మాట్లాడిన ఓ వీడియోను ఆర్జీవీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ‘రేయ్ ధర్మా రెడ్డి, దయాకర్ రావు అరచేతిని అడ్డుపెట్టి  సూర్యుడిని ఆపలేరని తెలుసుకోండి. మీరెన్ని కుట్రలు పన్నినా రేపు రిలీజయ్యే‘కొండా’సినిమాను ఆపలేరు. ఈ మూవీని ప్రజలు కోరుకుంటున్నారు. మేం ప్రజల నుంచే వచ్చిన నాయకులమని గుర్తుంచుకోవాలి’. అంటూ పేర్కొంది. 

మరోవైపు ‘కొండా’ మూవీ ట్రైలర్ లాంచ్ రేపు కొండా దంపతుల నివాసంలో జరగబోతున్నదని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో తెలిపారు. ఈ  సందర్భంగా కొండా మూవీ అభిమానులంతా హన్మకొండలోని రామ్ నగర్ లోని కొండా క్యాంపు ఆఫీసుకు ఉదయం 10:25 కి రావాలన్నారు. ఇట్లు రామ్ గోపాల్ వర్మ ఆహ్వానం అంటూ  పేర్కొన్నారు. ఇక రేపు రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ పై వరంగల్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


 

click me!