Rashmika Fans : ‘రష్మిక’ డబ్బులివ్వలేదనే విషయంలో ఫ్యాన్స్ ఫైర్.. అదిరిపోయే రిప్లై..

By team teluguFirst Published Jan 25, 2022, 10:09 PM IST
Highlights

ఆల్ ఇండియా క్రష్ రష్మిక తాజాగా పలు విమర్శలు, ఆరోపణలకు గురవుతున్నది. ఓ చిన్నారి డబ్బులు అడుకుంటున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇందుకు రష్మిక ష్యాన్స్ స్పందించారు. 
 

వరుస సినిమాల్లో నటిస్తూ హిట్ హీరోయిన్ గా నిలుస్తున్న రష్మిక ఇంకా షూటింగ్ లోనే బిజీగా ఉంటోంది. పలు చిత్రాల్లో నటిస్తున్న ఆమె ఇటీవల ముంబైకి షూటింగ్ నిమిత్తం వచ్చింది. అయితే  అక్కడ ఓ హోటల్ నుంచి బయటకు వస్తుండగా ఓ చిన్నారి వచ్చి అడుక్కోవడం ప్రారంభించింది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులు  ఆ పాపను  పక్కకు పంపిస్తారు. అయినా ఆ పాప రష్మికను అడుకున్నా రష్మిక ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వెళ్లి పోయిందంటూ నెట్టింట పెద్ద చర్చ కొనసాగుతోంది.

అయితే ఈ విషయంపై రష్మిక మండన్న ఫ్యాన్స్ స్పందించారు. తమ హీరోయిన్ ఆ సందర్భంలో ఇవ్వకపోవచ్చు కానీ ఎన్నో సందర్భాల్లో చిన్నారులకు డబ్బులిచ్చిందంటూ బదులిస్తున్నారు. రష్మిక చిన్నారికి డబ్బులివ్వకుండా వెళ్లిపోయిన వీడియోకు బదులుగా పలు సందర్భాల్లో చిన్నారులతో నవ్వుతూ మాట్లాడుతూ డబ్బులిచ్చిన వీడియో  లింక్ ను షేర్ చేస్తున్నారు.   

 

Why don't you guys highlight when she helps pic.twitter.com/4aIq4S4b7x

— RashmikaMandannafan (@rashmika_stan)

ఒకటి, రెండు సందర్భాలను బట్టి హీరోయిన్ క్యారెక్టర్ ను బ్యాడ్ చేయొద్దని, టాలీవుడ్ లో టాప్ హీరోలతో పనిచేస్తున్న తమ హీరోయిన్ కు ఆ మాత్రం తెలిసి ఉండదా? అనే ఇన్ టెన్షన్ లో రిప్లై ఇస్తున్నారు. తను డబ్బులిచ్చినప్పుడు మాత్రం ఎందుకు ఇంతలా హైలెట్ చేయలదంటూ ఘాటుగా స్పందించారు.   

మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ఫ’ మూవీ ఇంకా రికార్డులను కొల్లగొడుతూనే ఉంది. ఈ మూవీలో ‘శ్రీ వల్లి’ పాత్రలో నటించిన రష్మిక ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. విభిన్న పాత్రలో నటించడంతో తన క్రేజ్ మరింత పెరిగింది. 
 

click me!