RGV:పబ్ లో అమ్మాయిలతో ఈ వీడియోలు రచ్చేంది వర్మా

Surya Prakash   | Asianet News
Published : Jan 28, 2022, 06:00 AM IST
RGV:పబ్ లో అమ్మాయిలతో ఈ  వీడియోలు రచ్చేంది వర్మా

సారాంశం

ఈ రోజు, ఆయన ఒక పబ్‌లో  ఎంజాయ్ చేస్తున్న వీడియోలను వరస పోస్ట్ చేసారు. ఈ వీడియోలలో ఆయన... సిగరెట్టు తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించే ప్రయత్నం చేసారు. అలా కెమెరాకు ఫోజిచ్చారు.


ఎప్పుడూ ఏదో ఒక వివాదమో..సెన్సేషన్ తోనో తన పేరు ముడిపడాలని రామ్ గోపాల్ వర్మ కోరుకుంటారు. తన చేసే ప్రతీ చర్య  సమర్దనీయం కాకపోయినా కార్చిచ్చులా మీడియాలో చర్చనీయాంశం కావాలనుకుంటారు. అందుకోసం ఎంతకైనా దిగుతారు...ఒక్కోసారి దిగ జారుతూంటారు. తాజాగా ఆయన అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకోవటానికి పబ్ లో ముద్దుల పోగ్రాం పెట్టారు. ఈ మేరకు వీడియోలు సోషల్ మీడియాలో వదిలారు.

ఇవి చూసిన వాళ్లు ...ఒకటే మాట అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంతకంటే దిగజారడు అని మీరు అనుకున్నప్పుడల్లా, అతను మిమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూంటాడు అని. మీరు ఎంత అభిమాని అయినా ఈ వీడియోలు చిరాకు పెడతాయి.   ఆయన ఒక పబ్‌లో  ఎంజాయ్ చేస్తున్న వీడియోలను వరస పోస్ట్ చేసారు. ఈ వీడియోలలో ఆయన... సిగరెట్టు తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించే ప్రయత్నం చేసారు. అలా కెమెరాకు ఫోజిచ్చారు. అయితే అది ఆయన ఇష్టం. ఆయన వ్యక్తిగతం. ఆయన సోషల్ మీడియా. అయితే ఒక అమ్మాయి పెదవులపై ముద్దు పెట్టుకునే ఫొటోని ఉంచాడు.

 "నా అభిమానులు మరియు ద్వేషించే వారందరికీ దీనికి క్యాప్షన్ ఇవ్వమని కోరుతున్నాను. బెస్ట్ కాప్షన్ కు 1 లక్ష బహుమతిని అందజేయమని ఒక అభ్యర్థన" అని వర్మ పెట్టారు. తర్వాత ఏమనుకున్నారో దాన్ని ట్విట్టర్ నుంచి తొలిగించారు. అది ప్రక్కన పెడితే ఇక్కడ ఇచ్చిన వీడియోలు కూడా ఆయన అభిమానులు చాలా మందికి నచ్చటం లేదు. ట్రోలింగ్ చేస్తున్నారు. వర్మ కోరుకున్నది అదే అయితే సక్సెస్ అయ్యినట్లే.

 
ఇక  తాజాగా ఆయన తెరకెక్కించిన మరో చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత నేపథ్యం బేస్ చేసుకుని వర్మ ఈ సినిమా తెరకెక్కించాడు. . ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘కొండా’ ట్రైలర్ రిలీజ్ చేసారు.

‘కనీ వినీ యెరుగని  అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి. కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరా శక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్ర మైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్దమే, మా కొండా చిత్రం.

 

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?