మహేష్ మల్టీప్లెక్స్ పై వర్మ కామెంట్స్!

Published : Dec 01, 2018, 10:41 AM IST
మహేష్ మల్టీప్లెక్స్ పై వర్మ కామెంట్స్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ లో ఓ అధునాతన మల్టీప్లెక్స్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఏఎంబి మల్టీప్లెక్స్ పేరుతో ఈ థియేటర్లను నిర్మించారు. '2.0' సినిమాతో ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించాలి కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాని డిసంబర్ 2న ఆదివారం నుండి మొదలుపెట్టనున్నారు. 

తాజాగా ఈ మల్టీప్లెక్స్ ని సందర్శించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో ఈ మల్టీప్లెక్స్ పై కామెంట్స్ చేశారు. ''ఇప్పుడే ఏఎంబి సినిమా స్క్రీన్స్ చూశాను. డిసంబర్ 2న ప్రారంభం కానుంది.

బ్రీత్ టేకింగ్ ఎక్స్ పీరియన్స్.. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో మల్టీప్లెక్స్ కూడా అంత అందంగా ఉంది'' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు.. వంశీపైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్ లోనే సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్
హృతిక్ రోషన్ 'క్రిష్' సినిమాలో ధోని భార్య నటించిందా?