బీడీ తాగడం నేర్చుకున్నా.. హీరోయిన్ కామెంట్స్!

Published : Dec 01, 2018, 10:02 AM IST
బీడీ తాగడం నేర్చుకున్నా.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

కన్నడ బ్యూటీ నభా నటేష్.. సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో మంచి పేరే దక్కించుకుంది. 

కన్నడ బ్యూటీ నభా నటేష్.. సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో మంచి పేరే దక్కించుకుంది. రీసెంట్ గా రవిబాబు రూపొందించిన 'అదుగో' చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించింది.

ఈమెకి రవితేజ సినిమాలో ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. అలానే తెలుగులో కొన్ని సినిమాల కోసం నభా పేరుని పరిశీలిస్తున్నారట. సినిమాల్లో తన పాత్ర కోసం ఏదైనా చేస్తానని అంటోంది ఈ బ్యూటీ. కన్నడలో ఓ సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకుందట. అలానే బీడీ తాగడం కూడా నేర్చుకుందట.

ఈ విషయాన్ని నభా స్వయంగా చెప్పుకొచ్చింది. ''కన్నడ సినిమాలో ఓ సన్నివేశం కోసం బీడీ తాగాల్సి వచ్చింది. డైరెక్టర్ గారు ఏదోలా మేనేజ్ చేసేద్దామని అన్నారు. కానీ నాకు అలా చేయడానికి మనసొప్పలేదు. బీడీ తాగడం నేర్చుకొని ఆ సన్నివేశంలో నిజమైన బీడీనే తాగాను.

బీడీ తాగినన్ని రోజులు భోజనం చేయాలంటే వాంతు వచ్చేది. అయినా ఆ పాత్రకి పూర్తి న్యాయం చేశాననే ఫీలింగ్ నాకు సంతృప్తినిచ్చేది. అందుకే నా పాత్ర సరిగ్గా రావడం కోసం ఎంతైనా కష్టపడతాను'' అంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌