అమ్మాయితో ఆర్జీవి పార్టీ.. వ్యూహం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వర్మ..

Published : Feb 09, 2024, 02:43 PM IST
అమ్మాయితో ఆర్జీవి పార్టీ.. వ్యూహం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వర్మ..

సారాంశం

రామ్ గోపాల్ వర్మ దిల్ ఖుష్ లో ఉన్నాడు. అమ్మాయితో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు.. పార్టీ చేసుకుంటూనే ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. ?   

రామ్ గోపాల్ వర్మ  తాజా చిత్రం వ్యూహం. వైఎస్ జగన్ కు సపోర్ట్ చేస్తూ..  పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించిన ఈసినిమాపై గతం నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సినిమాలో చంద్రబాబు, లోకేష్ ప్రతిష్టకు భంగం కలిగించే సన్నివేశాలు పెట్టారంటూ.. ఈసినిమాపై కోర్టుల్లో కేసులు ఫైల్ అవ్వడంతో.. డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈసినిమా.. పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇక తాజాగా వ్యూహం సినిమా రిలీజ్ కు అడ్డంకులు తొలగిపోయాయి.

 

 ఈ విషయాన్ని చాలా డిఫరెంట్ గా వెల్లడించాడు రామ్ గోపాల్ వర్మ. విడుదల కు లైన్ క్లియర్ అయిందనివెల్లడించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ సినిమా విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు. ఈ నెల 23న ఈ సినిమాను  థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్  కాబోతోందని తెలిపారు. ఈ అనౌన్స్ మెంట్ ను వర్మ తన మార్క్ లో వెల్లడించారు. ఒక అమ్మాయితో పార్టీ చేసుకుంటున్న పిచ్చి పిచ్చిగా  ఫొటోలకు ఫోజులిస్తూ..  వీడియోలు షేర్ చేస్తూ  ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. '

అంతే కాదు ఈ ప్రకటన ద్వారా అటు చంద్రబాబు నాయుడికి, పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కు,లోకేష్ కు కౌంటర్ వేశాడు వర్మ. ఆయన పోస్ట్ లో ఏముందంటే..హేయ్ నారా లోకేశ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహం రిలీజ్ ను మేము సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. ఫిబ్రవరి 23న సినిమా రిలీజ్ కాబోతోంది. టీడీపీని తాగేయడానికి, జనసేనను తినేయడానికి మేము వస్తున్నాం' అని ట్వీట్ చేశాడు. 
 

PREV
click me!

Recommended Stories

Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?