బలగం సినిమా అందరూ చూశారు, ఒక్కరు తప్ప.. వేణు తీవ్ర భావోద్వేగం

By tirumala AN  |  First Published Feb 9, 2024, 2:32 PM IST

ఇంత గొప్ప విజయం సాధించిన బలగం చిత్రం విషయంలో డైరెక్టర్ వేణుకి చిన్న లోటు ఉండిపోయింది. తన తండ్రిని తలచుకుంటూ వేణు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.


జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన వేణు ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ గా మారాడు. వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది. తెలంగాణ గ్రామీణ భావోద్వేగాలు ఎంతో అద్భుతంగా తెరక్కించిన వేణు.. బలగం చిత్రంతో భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బలగం చిత్రం అంతర్జాతీయంగా అనేక అవార్డులు సొంతం చేసుకుంటోంది. 

సినీ రాజకీయ ప్రముఖుల నుంచి డైరెక్టర్ వేణుకి ప్రశంసలు దక్కాయి. భావోద్వేగాలని అద్భుతంగా ఆవిష్కరిస్తూ బలగం చిత్రాన్ని మరచిపోలేని మూవీగా మలిచారు అంటూ వేణు ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ గ్రామాల్లో బలగం చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. 

Latest Videos

ఇంత గొప్ప విజయం సాధించిన బలగం చిత్రం విషయంలో డైరెక్టర్ వేణుకి చిన్న లోటు ఉండిపోయింది. తన తండ్రిని తలచుకుంటూ వేణు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వేణు తండ్రి దాదాపు 24 ఏళ్ల క్రితమే మరణించారు. రీసెంట్ గా వేణు తండ్రి వర్థంతి కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా వేణు తన తండ్రిని తలచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నా బలగం సినిమా అందరూ చూశారు.. మా నాన్న తప్ప.. మిస్యూ నాన్న అంటూ వేణు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన సినిమా చూడకపోయినా ఆశీస్సులు నీకు ఉన్నాయి.. అందుకే అంత పెద్ద హిట్ కొట్టావు అంటూ నెటిజన్లు వేణు పోస్ట్ కి కామెంట్స్ చేస్తున్నారు. 

click me!