నిఖిల్ హీరోగా.. రామ్ చరణ్ కొత్త బ్యానర్ లో ఫస్ట్ సినిమా టైటిల్ వచ్చేసింది.. అదిరిపోయే డిటేయిల్స్

By Asianet News  |  First Published May 28, 2023, 1:07 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  కొత్త ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఫస్ట్ సినిమాను ప్రకటించారు. డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఆ పాన్ ఇండియా సినిమా టైటిల్ ను తాజాగా అనౌన్స్ చేశారు. 
 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాత విక్రమ్ రెడ్డితో కలిసి కొత్త ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘V మెగా పిక్చర్స్’ బ్యానర్ పేరిట ప్రకటన చేశారు. కొత్త టాలెంట్ ను ప్రొత్సహించడమే దీని లక్యం. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి తాజాగా పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సావస్కర్ (Veer Savaskar)  జయంతి సందర్భంగా ఫస్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్  చేశారు. టైటిల్ తో పాటు ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవర్ ప్యాక్డ్ వీడియోనూ విడుదల చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ప్రొడక్షన్ హౌజ్ లోని మొదటి పాన్ ఇండియా చిత్రానికి ‘ది ఇండియా హౌజ్’ (The India House)  అనే టైటిల్ ను ఖరారు చేశారు.‘కార్తీకేయ 2’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)  లీడ్ రోల్ లో నటిస్తున్నారు. శివ అనే పాత్రలో నటిస్తున్నారు. 'వి మెగా పిక్చర్స్' మరియు 'అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్' సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు.

Latest Videos

మరో యుగానికి తీసుకెళ్లి, హృదయాలను హత్తుకునే కథలో  ప్రేక్షకులను లీనం చేసేలా ఇండియా హౌస్ సిద్ధమైంది. లండన్‌లో స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన నేపథ్యంలో, టీమ్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం ‘ది ఇండియా హౌస్’ చుట్టూ రాజకీయ గందరగోళం సమయంలో ఒక ప్రేమకథను వివరిస్తుంది. కాలిపోతున్న ఇండియా హౌస్ ను చూపిస్తూ నాటకీయ చిత్రాలతో టీజర్ ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ఆకట్టుకుంటోంది. 

గ్లోబల్ ఫోర్స్‌గా పేరుగాంచిన, దేశం గర్వించేలా చేసిన రామ్ చరణ్, అదే సమయంలో అభిషేక్ అగర్వాల్ కంటెంట్ ఆధారిత సినిమాలను నిర్మించాలనే దృక్పథంతో ఉన్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్స్  అందనున్నాయి.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. అటు నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘స్పై’లో నటిస్తున్నారు. 

On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film - THE INDIA HOUSE
headlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna!
Jai Hind! … pic.twitter.com/YYOTOjmgkV

— Ram Charan (@AlwaysRamCharan)
click me!