'ఉయ్యాలవాడ' కాంట్రవర్సీ.. రామ్ చరణ్ డెసిషన్!

By AN TeluguFirst Published Sep 27, 2019, 10:30 AM IST
Highlights

సైరా సినిమా విషయమై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులకు రాయల్టీ లేదా సాయం అందించే విషయంలో రగడ జరుగుతోంది. ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కింది.
 

'సైరా నరసింహారెడ్డి' సినిమా విషయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులకు రాయల్టీ లేదా సాయం అందించే విషయంలో గొడవ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

తాను ఏమైనా చేయాలనుకుంటే నరసింహారెడ్డి ప్రాంతానికి లేదా ఊరికి చేస్తానని.. అక్కడ అభివృద్ధి పనులకు సహకరిస్తానని.. అంతేకానీ కొంతమంది వ్యక్తులకు ఆర్ధిక సహాయం చేయనని గతంలో రామ్ చరణ్ చెప్పారు. ఆయన ఇప్పటికీ అదే మాట మీద ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.

తాను ఇప్పటికే ఆ ప్రాంతం అవసరాలపై ఆరా తీశానని, కొన్ని పనులు చేపట్టే ఆలోచనలో ఉన్నానని.. కొన్ని పనుల ప్రతిపాదనలు ప్రభుత్వమే చేపడుతోందని ఆయన వివరించారు. ఒక గొప్ప వ్యక్తి కుటుంబానికి చెందినావారు ఎందరో ఉండొచ్చని.. వారిలో కొందరికి ఏదో చేసేసి చేతులు దులుపుకునే కంటే ఆ వ్యక్తి పేరు చెప్పి ఆ ప్రాంతానికి ఎంతోకొంత చేయడం కరెక్ట్ అని తనకు అనిపించిందని.. అందుకే ఈ నిర్ణయానికి వచ్చానని అన్నారు.

దాదాపు రూ.270 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేశారు. దక్షిణాది అగ్ర తారలతో పాటు అమితాబ్ లాంటి బాలీవుడ్ దిగ్గజాలు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!