చరణ్ ధరించిన వాచ్ ధర తెలిస్తే షాకే

Published : Apr 10, 2021, 08:41 PM IST
చరణ్ ధరించిన వాచ్ ధర తెలిస్తే షాకే

సారాంశం

ఈ మధ్య అనేక వేదికలపై రామ్ చరణ్ చేతికి వాచ్ తో కనిపిస్తున్నారు. దీనితో ఆ వాచ్ మోడల్, ఖరీదు ఎంత అని ఫ్యాన్స్ రీసెర్చ్ చేశారట.

ఫేమ్, నేమ్ కలిగిన స్టార్స్ ప్రతి కదలికను ఫ్యాన్స్, మీడియా గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల లైఫ్ స్టైల్  పై ప్రత్యేక ద్రుష్టి ఉంటుంది. వాళ్ళు ధరించే బట్టలు, షూస్, వాడే కార్లు ఇలా అనేక విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధరించిన ఓ వాచ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 


ఈ మధ్య అనేక వేదికలపై రామ్ చరణ్ చేతికి వాచ్ తో కనిపిస్తున్నారు. దీనితో ఆ వాచ్ మోడల్, ఖరీదు ఎంత అని ఫ్యాన్స్ రీసెర్చ్ చేశారట. ఇక చరణ్ ధరిస్తున్న ఆ లగ్జరీ బ్రాండ్ వాచ్ ధర అక్షరాలా  లక్షా 50వేల డాలర్లు అట. అంటే మన కరెన్సీలో కోటి రూపాయల పైమాటే. చరణ్ అంత ఖరీదైన వాచ్ ధరిస్తున్నారా అంటూ, అందరూ నోరెళ్లబెడుతున్నారు.

 
మరోవైపు చరణ్ ఏకకాలంలో రెండు సినిమాలు పూర్తి చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో చరణ్ సిద్ధ అనే ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన బర్త్ డే కానుకగా సిద్ద లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 


అలాగే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మగధీర సినిమాలో రాజమౌళి రామరాజు రోల్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ నుండి కూడా బర్త్ డే గిఫ్ట్ గా లుక్ విడుదల చేశారు. అల్లూరి గెటప్ లో చరణ్ లుక్ అద్బుతంగా ఉంది. ఆచార్య మే 13న విడుదల కానుండగా, ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న విడుదల అవుతుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే