
టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు టాంజానియా లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అక్కడి అందాలను ఆసాంతం ఆస్వాదించారు. కొన్నాళ్ళు సినిమాలు, టెన్షన్లకు దూరంగా ప్రకృతి అందాలను ఆస్వాదించిన వారు. ఇండియాకు చేరారు మెగా జంట. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా ఓ వారం పాటు జపాన్ లో సందడి చేసిన రామ్ చరణ్.. అక్కడ పర్యటన ముగించుకుని డైరెక్ట్ గా టాంజానియా ప్లైట్ ఎక్కారు. ఇక ఓ ఉద్యాన వనంలో.. జంతువులను చూసుకుంటూ.. ప్రకృతి ఒడిలో సేదతిరారు స్టార్ కపుల్.
ఇక టాంజానియాలో రైడ్ చేశాడు రామ్ చరణ్.. ఓపెన్ టాప్ జీప్ ను రామ్ చరణ్ నడుపుతుంటే, పక్కనే ఓ చిన్నారి కూర్చున్నాడు. ఆ తర్వాత అక్కడ టూర్ లో భాగంగా ఓపెన్ ప్లేస్ లో ఏర్పటు చేసిన కిచెన్ లో .. స్టవ్ పై చరణ్ ఆమ్లెట్ వేశాడు. ఇదంతా టాంజానియా సఫారీలో భాగమని తెలుస్తోంది. రామ్ చరణ్ కు సాయంగా కొందరు స్థానికులు వెంట ఉన్నారు. టూర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు చరణ్.
రామ్ చరణ్, ఉపాసన ఆఫ్రికా దేశాల పర్యటనలో గట్టిగా ఎంజాయ్ చేసి కొన్ని రోజులుగా వీరు అక్కడి పలు ప్రాంతాలను సందర్శిస్తూ మరపురాని జ్ఞాపకాలను పోగేసుకుంటున్నారు. టాంజానియాలోని ఓ సఫారీలో సింహాలను దగ్గరుండి రామ్ చరణ్ ఫొటోలు తీస్తున్న వీడియోను ఆయనే స్వయంగా కొన్ని రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయడం తెలిసిందే.
తమ రొమాంటిక్ టూర్ కు సబంధించిన దృశ్యాలతో కూడిన షార్ట్ వీడియోను తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఉపాసన పోస్ట్ చేశారు. ఇందులో ఎక్కువ సింహాలు కనిపిస్తున్నాయి. అలాగే, రామ్ చరణ్, ఉపాసన నేలపై సేద తీరడం, ఓ చెట్టు దగ్గరకు చేరి ఫొటోలు తీసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. గత నెల 20న జపాన్ వెళ్లిన ఈ జంట అటు నుంచి అటే ఆఫ్రికాకు వెళ్లి.. అక్కడి అందాలను చూస్తూ.. మైమరచిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.