రాంచరణ్ తో కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మూవీ నిజమేనా.. ఆ ట్వీట్ మ్యాటర్ ఏంటి ?

By team teluguFirst Published Jan 2, 2023, 5:21 PM IST
Highlights

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రాంచరణ్   నటిస్తున్న చిత్రాలపై హైప్ పెరిగిపోతోంది. దీనితో చరణ్ కూడా తన చిత్రాలు విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. 

అయితే రాంచరణ్ తదుపరి చిత్రాల లైనప్ క్రేజీగా మారుతోంది. చరణ్ ఆల్రెడీ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కన్నడ డైరెక్టర్ నర్తన్ ప్రాజెక్టు కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. సుకుమార్ చిత్రం కూడా లైన్ లో ఉంది. అయితే తాజాగా కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి గురించి వార్తలు మొదలయ్యాయి. 

వివేక్ అగ్నిహోత్రి, రాంచరణ్ కాంబినేషన్ లో చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ఓ నెటిజన్ న్యూ ఇయర్ సందర్భంగా వివేక్ ని విష్ చేస్తూ.. రాంచరణ్ తో మీ చిత్రం కోసం ఎదురుచూస్తున్నా' అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ని వివేక్ రీట్వీట్ చేస్తూ.. మమ్మల్ని ఆశీర్వదించండి' అని కామెంట్ పెట్టారు. ఇది కాస్త వైరల్ గా మారింది. 

నెటిజన్ అడిగారు కాబట్టి వివేక్ అలా కామెంట్ చేశారా లేక నిజంగానే రాంచరణ్ తో ఆయన మూవీ చేయబోతున్నారా అనేది క్లారిటీ లేదు. కానీ సంకేతాలు అలాగే కనిపిస్తున్నాయి. వివేక్ అగ్నిహోత్రి ఇటీవలే సుకుమార్ ని కూడా కలసిన సంగతి తెలిసిందే. అయితే రాంచరణ్ చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేస్తారా లేక నిర్మిస్తారా అనేది చూడాలి. 

click me!