మహేష్, బన్నీకి పోటీగా రాంచరణ్ కూడా బరిలోకి.. బడా సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా..

Published : Aug 30, 2022, 07:48 AM IST
మహేష్, బన్నీకి పోటీగా రాంచరణ్ కూడా బరిలోకి.. బడా సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా..

సారాంశం

కమర్షియల్ యాడ్స్ విషయానికి వస్తే టాలీవుడ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే మహేష్, బన్నీ బోలెడన్ని యాడ్స్ చేస్తున్నారు. కోట్లాది రూపాయలు పోగేసుకుంటున్నారు. తాజాగా రాంచరణ్ కూడా రంగంలోకి దిగాడు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీని 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. దీనితో ఈ చిత్రం మెమొరబుల్ గా నిలిచిపోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ కోసం శంకర్.. రాంచరణ్ చిత్రానికి కొంత గ్యాప్ ఇచ్చాడు.   

ఈ గ్యాప్ లో రాంచరణ్ ఓ క్రేజీ డీల్ కుదుర్చుకున్నాడు. కమర్షియల్ యాడ్స్ విషయానికి వస్తే టాలీవుడ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే మహేష్, బన్నీ బోలెడన్ని యాడ్స్ చేస్తున్నారు. కోట్లాది రూపాయలు పోగేసుకుంటున్నారు. తాజాగా రాంచరణ్ కూడా రంగంలోకి దిగాడు. 

ప్రస్తుతం రాంచరణ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థకి అంబాసిడర్ గా సైన్ చేశాడు. తనగా మరో బడా సంస్థకి చరణ్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. మోటార్ వెహికల్స్ సంస్థ 'హీరో'కి చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. భారీ రెమ్యునరేషన్ తో చరణ్ ప్రస్తుతం ఈ సంస్థ తయారు చేసే బైక్ ప్రచారం కోసం యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. త్వరలోనే ఈ యాడ్ రిలీజ్ కానుంది. 

ఆర్ఆర్ఆర్ మూవీలో రామరాజుగా అద్భుత నటనతో రాంచరణ్ మెప్పించాడు. ఈ చిత్రం రాంచరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది. క్లైమాక్స్ లో రాంచరణ్ శ్రీరాముడి తలపించే గెటప్ లో చేసే పోరాట సన్నివేశం నార్త్ ఆడియన్స్ ని ఫిదా చేసింది. శంకర్ మూవీ తర్వాత చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?