
యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే విశాల్ (Vishal) తాజాగా మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. జయాపజయాలకు అతీతంగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు దూసుకుపోతున్నారు. గాయాలు లెక్కచేయకుండా రియల్ స్టంట్స్ చేస్తూ సినిమాపై తనకున్న ప్యాషన్‌ని చాటుకునే విశాల్ పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 29). ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.
ప్రస్తుతం `లాఠి` అనేసినిమాలో నటిస్తున్న విశాల్ నెక్ట్స్ `మార్క్ ఆంటోని` అనే మరో మూవీలోనూ హీరోగా నటిస్తున్నారు. తన బర్త్ డే సందర్భంగా సోమవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో విశాల్ సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న తెలుస్తుంది. నుదుడికి అడ్డు నామాలు, గెడ్డంతో అరుస్తూ కనిపిస్తున్నారు విశాల్. "మార్క్ ఆంటోనీ" ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో విశాల్ చాలా రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నటువంటి సరికొత్త గెటప్ లో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అర్థమవుతుంది. ఇది విశాల్ అభిమానులకు బెస్ట్ బర్త్ డే ట్రీట్ అని చెప్పొచ్చు.
విశాల్ నటిస్తున్న 33వ చిత్రం `మార్క్ ఆంటోనీ` కావడం విశేషం. మినీ స్టూడియోస్ పతాకంపై రీతు వర్మ , సునీల్ వర్మ , అభినయ , YGee మహేంద్రన్ , నిజగల్ రవి , కింగ్స్లీ నటీ నటులుగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని యూనిట్ చెప్పింది. దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు.
తారాగణం:
విశాల్ , ఎస్. జె.సూర్య , రీతు వర్మ , సునీల్ వర్మ , అభినయ , YGee మహేంద్రన్ , నిజగల్ రవి , కింగ్స్లీ.
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : మినీ స్టూడియోస్
నిర్మాతలు : ఎస్ వినోద్ కుమార్ -మినీ స్టూడియోస్ రచయిత & దర్శకుడు - అధిక్ రవిచంద్రన్
సంగీతం - జివి ప్రకాష్ కుమార్
డి ఓ పి - అభినందన్ రామానుజం
ఆర్ట్ డైరెక్టర్ -ఆర్ విజయ్ మురుగన్
ఎడిటర్ - విజయ్ వేలుకుట్టి
యాక్షన్ డైరెక్టర్స్ - దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్, కనల్ కన్నన్, రవివర్మ
కాస్ట్యూమ్ డిజైనర్-సత్య NJ
కొరియోగ్రాఫర్లు - దినేష్, బాబా బాస్కర్, అజహర్
గీత రచయితలు- మధుర కవి, అసల్ కొలారు, అధిక్ రవిచంద్రన్
పబ్లిసిటీ డిజైన్స్ -కబిలన్