RC17 సినిమా ప్రకటన.. రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబోలో మరో సంచలనానికి శ్రీకారం..

Published : Mar 25, 2024, 04:41 PM IST
RC17 సినిమా ప్రకటన.. రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబోలో మరో సంచలనానికి శ్రీకారం..

సారాంశం

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో `రంగస్థలం` మూవీ వచ్చి పెద్ద హిట్‌ అయ్యింది. ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. హోలీ సందర్భంగా దీన్ని ప్రకటించింది యూనిట్‌.   

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన `రంగస్థలం` సంచలనం క్రియేట్‌ చేసింది. అప్పట్లో  నాన్‌ `బాహుబలి` రికార్డులను బ్రేక్‌ చేసింది. అంతేకాదు ఇతర దర్శకులు కూడా ఊపు తీసుకొచ్చింది. రాజమౌళి మాత్రమే కాదు, మనం కూడా సంచలనాలు క్రియేట్‌ చేయోచ్చనే ధైర్యాన్నిచ్చింది. బడ్జెట్‌ పరిధులు పెంచింది. ఇప్పుడు ఈ కాంబోలో మరో మూవీ వస్తుంది. మరోసారి ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు. చాలా కాలంగా వీరి కాంబినేషన్‌లో సినిమా అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

కలర్‌పుల్‌ పండగ హోలీని పురస్కరించుకుని ఈ మూవీని అనౌన్స్ చేశారు. `రంగస్థలం` కాంబో రిపీట్‌ అనేలా హీరో, దర్శకుడు మాత్రమే కాదు, మ్యూజిక్‌ డైరెక్టర్, నిర్మాణసంస్థ కూడా సేమ్‌ కావడం విశేషం. దీనికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. దీనికి సుకుమార్‌ రైటింగ్స్ భాగం అవుతుంది.

`ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత రామ్‌ చరణ్‌ రేంజ్‌ పెరిగింది. ఆయన గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌`తో హీరోగా మరింతగా ఎదిగే అవకాశం ఉంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా కూడా భారీ స్థాయిలో ఉండబోతుంది. మరోవైపు `పుష్ప` తర్వాత ఇండియన్‌ సినిమా లెక్కలు మార్చేశాడు సుకుమార్‌. ఇప్పుడు `పుష్ప2`తో గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేశాడు. ఈ క్రమంలో అనంతరం రామ్‌ చరణ్‌ మూవీ చేయబోతుండటంతో వీరి కాంబో మూవీ మరో స్థాయిలో ఉండబోతుందని చెప్పొచ్చు.

 `పుష్ప2` తర్వాత సుకుమార్‌ ఈ ప్రాజెక్ట్ పైనే ఫోకస్‌ పెట్టబోతున్నారు. దీన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించి, వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మూవీపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఈ మూవీతో మరో ట్రెండ్‌ సెట్టింగ్‌ కంటెంట్‌ని ఇవ్వబోతున్నారట సుకుమార్‌. సినిమా కలర్‌నే మార్చేయబోతున్నట్టు టీమ్‌ ప్రకటించడం విశేషం.  

Read more: అల్లు అర్జున్ ని మూడు గంటలు ఎండలో నిలబెట్టిన సుకుమార్... పుష్ప 2 అందుకే ఆలస్యం!

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ