శ్రీవారిని దర్శించుకున్న వెంకటేష్‌ కూతురు, అల్లుడు.. ఎంత సింపుల్‌గా ఉన్నారో!

Published : Mar 25, 2024, 03:43 PM IST
శ్రీవారిని దర్శించుకున్న వెంకటేష్‌ కూతురు, అల్లుడు.. ఎంత సింపుల్‌గా ఉన్నారో!

సారాంశం

హీరో విక్టరీ వెంకటేష్‌ రెండో కూతురు హవ్య వాహిని వివాహం ఇటీవల జరిగింది. తాజాగా కొత్త శ్రీవారిని సందర్శించుకున్నారు. తిరుమల వెంకటేశ్వరుడి ఆశిస్సులు తీసుకున్నారు.  

టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌లో ఒకరైన వెంకటేష్‌ తన రెండో కూతురు పెళ్లిని ఇటీవల నిర్వహించారు. చాలా ప్రైవేట్‌గా ఈ వివాహం జరిగింది. బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వివాహం జరిగింది. సినిమా సెలబ్రిటీలు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. వెంకీ చాలా ప్రైవేట్‌గా ఈ వివాహం చేసే ప్రయత్నం చేశారు. 

survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గతంలో తన పెద్ద కూతురు వివాహం చేసిన వెంకటేష్‌.. ఇటీవల రెండో కూతురు హయ వాహిని వివాహం నిర్వహించారు. విజయవాడకి చెందిన డాక్టర్‌ నిశాంత్‌ పాతూరితో ఆమె మ్యారేజ్‌ జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మ్యారేజ్‌ చేసినట్టు సమాచారం. ఈ మేరకు అధికారికంగా కొత్త జంట ఫోటోలు విడుదల చేశారు. అవి వైరల్‌ అయ్యాయి. 

ఇక ఇప్పుడు ఈ కొత్త తిరుమల శ్రీవారిని సందర్శించుకుంటుంది. కొత్తగా పెళ్లైన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆశిస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరి వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఆమె వెంకీ కూతురు అని తెలియకపోవడంతో చాలా సింపుల్‌గానే అక్కడిగా నుంచి పోయారు. వెంకటేష్‌కి ముగ్గురు కూతురుళ్లు, ఒక కుమారుడు అర్జున్‌ ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు అవగా, మరో అమ్మాయి ఉంది. 

వెంకటేష్‌ ఈ సంక్రాంతి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఆయన `సైంధవ్‌` చిత్రంలో నటించారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ పరాజయం చెందింది. ప్రస్తుతం ఆయన అనిల్‌ రావిపూడితో సినిమా చేయాల్సి ఉంది. ఈ లోపు వెంకీ `రానా నాయుడు` సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌లో నటించబోతున్నారు. ముంబాయిలో ఈ సిరీస్‌ షూటింగ్‌ జరుగుతుంది. ఈ షూటింగ్‌ అనంతరం అనిల్‌ రావిపూడి మూవీ ప్రారంభమవుతుంది. జూన్‌, జులైలో ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌