
యంగ్ హీరో నాగచైతన్యకి ఇటీవల కాలంలో సరైన హిట్ పడటం లేదు. `లవ్ స్టోరీ` ఫర్వాలేదనిపించగా, `థ్యాంక్యూ`, `కస్టడీ` మూవీస్ డిజప్పాయింట్ చేశాయి. దీంతో ఒక్కసారిగా చైతూ డౌన్ అయిపోయాడు. అయినా తగ్గలేదు. ఇప్పుడు భారీ సినిమాతో రాబోతున్నాడు. పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ `తండేల్` మూవీ చేస్తున్నాడు. దీనికి `కార్తికేయ2` ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహించడం విశేషం.
ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆ మధ్య గోవా పరిసర ప్రాంతాల్లో ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు మరో షెడ్యూల్‌కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆల్‌రెడీ ఓవర్సీస్ అమ్ముడు పోయినట్టు ప్రచారం జరుగుతుంది. ఓవర్సీస్ డిస్టిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ఈ హక్కులను సొంతం చేసుకుందట. సుమారు రూ.6.5కోట్లకి ఈ మూవీ అమ్ముడు పోయినట్టు సమాచారం.
నాగచైతన్య నటించిన గత చిత్రాలు `థ్యాంక్యూ` మూవీ ఓవర్సీస్ రైట్స్ రెండు కోట్ల 70లక్షలకు అమ్ముడు పోయింది. ఆ తర్వాత వచ్చిన `కస్టడీ` మూవీ రెండు కోట్లకు అమ్ముడు పోయింది. ఈ రెండు సినిమాలు నిరాశ పరిచాయి. అయినా కూడా ఇప్పుడు `తండేల్` చిత్రం ఆరున్నర కోట్లకు అమ్ముడు పోవడం విశేషమనే చెప్పాలి.
మత్య్సకారుల నేపథ్యం పోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో సాగే మూవీ ఇది అని తెలుస్తుంది. ఇందులో జాలరిగా నాగచైతన్య కనిపిస్తాడట. అక్కడి అమ్మాయిగా సాయిపల్లవి కనిపిస్తుందని, ఈ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. దీనికి బార్డర్ గొడవలకు సంబంధం ఏంటి? చైతూ పాకీస్థాన్ ఆర్మీకి ఎందుకు చిక్కాడు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. గీతా ఆర్ట్స్ ఈ మూవీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Read more: ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన స్టార్ హీరో... ఎక్కడ తేడా జరిగింది?