పెద్ది మూవీలో భారీ యాక్షన్ సీన్, ఎంట్రీ ఇచ్చిన మీర్జాపూర్ నటుడు.. రాంచరణ్ స్పెషల్ పోస్ట్ వైరల్

Published : May 22, 2025, 05:29 PM IST
Ram Charan Peddi Movie

సారాంశం

రాంచరణ్ నటిస్తున్న పెద్ది షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. తాజా షెడ్యూల్‌లో యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నారు.

రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. దేశవ్యాప్తంగా క్రికెట్, సినీ అభిమానులు పెద్ది టీజర్ లోని రాంచరణ్ షాట్ ని రీక్రియేట్ చేస్తూ రీల్స్ చేశారు. లండన్ లో తన స్టాట్యూ ఆవిష్కరణ జరిగిన తర్వాత చరణ్ తిరిగి పెద్ది షూటింగ్ లో అడుగుపెట్టారు. 

హైదరాబాద్ లో నిర్మించిన విలేజ్ సెట్ లో ప్రస్తుతం రాంచరణ్ పై బుచ్చిబాబు భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ ని ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా రూపొందించారు. తాజా షెడ్యూల్ కొన్ని కీలక మైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుతుంది. ఇప్పటికే చిత్రీకరణలో సుమారు 30 శాతం పూర్తయినట్టు సమాచారం.

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని, రాంచరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో “హ్యాపీ హనుమాన్ జయంతి. ఈ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ లో హార్డ్ వర్క్,, చిరునవ్వులు చర్చలు అన్నీ జరుగుతున్నాయి” అని పోస్టు చేశారు. రాంచరణ్ ఓ ఫోటో కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలో రాంచరణ్ తో పాటు మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, దర్శకుడు బుచ్చిబాబు కూడా ఉన్నారు.

 

 

పెద్ది చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, సత్య వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ షెడ్యూల్ లో మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కూడా పాల్గొంటుండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. వీరిద్దరి మధ్య భారీ పోరాటం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ