ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్డేట్.. పవన సుతుని జయంతి రోజున అంటూ హరీష్ ఎలివేషన్

Published : May 22, 2025, 03:45 PM IST
Ustaad Bhagat Singh

సారాంశం

ఒక్కసారిగా పవన్ నటిస్తున్న చిత్రాలలో కదలిక వచ్చింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ కూడా అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. 

ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలు ముందుకు కదులుతున్నాయి. హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఓజి షూటింగ్ కూడా త్వరలో పూర్తి కానుంది. ఇక మిగిలింది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మాత్రమే. తాజాగా ఉస్తాద్ మేకర్స్ కూడా అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు.  

ఉస్తాద్ భగత్ సింగ్ తిరిగి ప్రారంభం 

ఈ చిత్రం లో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు హనుమాన్ జయంతి రోజున చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన అప్‌డేట్ ఇచ్చింది. పవన్ చేతిని హరీష్ శంకర్ పట్టుకుని ఉన్న పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించారు. పవన సుతుని జయంతి సందర్భంగా మాసివ్ అప్డేట్ అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. కొద్ది సేపటి తర్వాత చిత్ర యూనిట్ అప్డేట్ ని రివీల్ చేశారు.

 

 

ఈ సందర్భంగా మేకర్స్ ఒక అధికారిక ప్రకటనలో, "ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది" అని వెల్లడించారు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

పవన్, హరీష్ కాంబోలో రెండోసారి

‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా కాలంగా ఈ చిత్రం వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావడం వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. దీనితో హరీష్ శంకర్ మధ్యలో రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. ఆ చిత్రం డిజాస్టర్ అయింది. దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విజయం సాధించడం హరీష్ శంకర్ కి చాలా కీలకం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

First Finalist: బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ కన్ఫమ్‌.. తనూజ చేసిన మోసానికి రీతూ బలి
Mirchi Madhavi: ఐదుగురితో కాంప్రమైజ్ అయితే ప్రకాష్ రాజ్ భార్యగా ఛాన్స్, నీ సంగతి తెలుసులే అన్నారు