Ram Charan,Shankar Movie: శంకర్, రామ్ చరణ్ షూటింగ్ లో రచ్చ రచ్చ.. దిల్ రాజుకు తప్పని తిప్పలు

Published : Feb 16, 2022, 11:49 AM ISTUpdated : Feb 16, 2022, 11:53 AM IST
Ram Charan,Shankar Movie: శంకర్, రామ్ చరణ్ షూటింగ్ లో రచ్చ రచ్చ..  దిల్ రాజుకు తప్పని తిప్పలు

సారాంశం

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్(Shankar) తో పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ (Ram Charan ) నటిస్తోన్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. అయితే ఈమూవీ టీమ్ ను మాత్రం అనుకోని చికాకులు వెంటాడుతున్నాయి.

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్(Shankar) తో పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ (Ram Charan ) నటిస్తోన్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. అయితే ఈమూవీ టీమ్ ను మాత్రం అనుకోని చికాకులు వెంటాడుతున్నాయి.

దర్శకుడు శంకర్‌ (Shankar), రామ్‌చరణ్‌ (Ram Charan ) ల పార్ ఇండియా భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. స్టోరీకి తగ్గట్టుగా అవసరాల మేరకు దర్శకుడు శంకర్ (Shankar) ఓపెన్ స్పేస్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇదే ఇప్పుడు  నిర్మాణ బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. రామ్ చరణ్ (Ram Charan )  తో పాటు టీమ్ అందరికి లేని పోని చిక్కులు తెచ్చిపెడుతోంది.  

చూట్టుపక్కల నుంచి షూటింగ్‌ని చూసేందుకు జనం పెద్దఎత్తున అక్కడికి తరలివస్తూ.. షూటింగ్ కి సంబంధించిన  దృశ్యాలను తమ మొబైల్‌లో షూట్ చేస్తున్నారు. దాంతో ఇది పెద్ద సమస్యగా మారింది. షూట్ చేసిన వారు ఊరికే ఉండకుండా.. ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుండటంతో.. మూవీ షూటింగ్ దశలోనే లీక్ అవుతుంది.

ఇక ఈ సమస్యను క్లియర్ చేయడానికి నిర్మాత దిల్ రాజు (Dil Raju) బృందం యాక్షన్ లోకి దిగారు. వారి షూటింగ్ ఫుటేజీకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోల లింక్‌లను డిలేట్ చేయడం ప్రారంభించారు. అంతే కాదు షూటింగ్ కు సంబందించిన  విజువల్స్‌ను క్యాప్చర్ చేయవద్దని అభిమానులను మరియు ప్రజలను వారు కోరుతున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్(Ram Charan )  సివిల్ సర్వీసెస్ అధికారిగా నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani)నటిస్తోంది.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది ఈమూవీ. సెకండ్ షెడ్యూల్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న టీమ్.. రీసెంట్ గా మళ్లీ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తుండగా.. సునిల్, జయరామ్, అంజలీ లాంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  శంకర్ హిట్ సినిమాల్లో ఒకటైన ఒకే ఒక్కడు సినిమాకు ఈ మూవీ సీక్వెల్ అని తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?