ఇండియా టుడే కాన్ క్లేవ్ 2023 ఈవెంట్ లో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ‘నెపోటిజం’పై ప్రశ్న ఎదురైంది. ఇందుకు గ్లోబల్ స్టార్ ఆసక్తికరంగా బదులిచ్చారు.
‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కడం పట్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చాలా సంతోషిస్తున్న విషయం తెలిసిందే. ఆస్కార్ ఈవెంట్ ముగించుకొని నిన్నే ఇండియా అడుగుపెట్టారు. ఢిల్లీలో ఫ్లైట్ దిగిన వెంటనే నేరుగా ప్రతిష్టాత్మక ఈవెంట్ ఇండియా టుడె కాన్ క్లేవ్ 2023కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈఈవెంట్ సందర్భంగా రామ్ చరణ్, చిరంజీవి అమితా షాతో బేటీ అయిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ చరణ్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
అయితే, ఈవెంట్ లో రామ్ చరణ్ కు నెపోటిజంపై ప్రశ్న ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండిస్ట్రీలో అడుగుపెట్టిన చెర్రీ ఆసక్తికరంగా బదులిచ్చారు. చరణ్ మాట్లాడుతూ.. నిజానికి నెపోటిజం ఏంటనేది నాకూ అర్థం కావడం లేదు. ఇటీవల దీని గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. బహుశా నెపొటిజనం ఉందని భావించే వాళ్లే ఈ అంశంపై ఎక్కువగా చర్చిస్తున్నారు. యష్, తదితర హీరోలు తమ టాలెంట్ తోనే పైకి వచ్చారని గుర్తు చేశారు.
ఇక తను మాత్రం తండ్రి చిరంజీవి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చానన్నారు. ఎందుకంటే తనకు నటనంటే ఇష్టమని, పుట్టినప్పటి నుంచి పరిశ్రమలోనే పెరిగానని చెప్పుకొచ్చారు. సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్లను మీట్ అవుతూ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నామన్నారు. తనకు నచ్చిన పనివల్లే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా 14 ఏండ్లు నిలబడేందుకు కష్టపడ్డట్టు తెలిపారు.
అలాగే చిత్రపరిశ్రమలో టాలెంట్ మాత్రమే మాట్లాడుతుందన్నారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. టాలెంట్ లేకపోతే నిలబడటం, కేరీర్ ముందుకు సాగడం చాలా కష్టమని అన్నారు. ఇక తను సినిమాల్లోకి వచ్చేముందుకు తన తండ్రి చిరంజీవి చెప్పిన మాటలనూ గుర్తు చేసుకున్నారు. ‘సక్సెస్, ఫెయిల్యూర్ ఏదైనా రానివ్వు.. నీకోసం పనిచేసే వాళ్లకు అండగా ఉండాలి’ అని చెప్పారన్నారు. ఎప్పటికీ తండ్రి చెప్పిన ఆ మాటలను గుర్తు పెట్టుకుంటానని అన్నారు.
ఇక ఈవెంట్ ముగించుకొని నిన్న రాత్రే రామ్ చరణ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో చరణ్ అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. ఆస్కార్స్ తర్వాత తొలిసారిగా ఇండియా టుడే ఈవెంట్ లో రామ్ చరణ్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం చరణ్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కించుకోవడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై భారీ హైప్ ఉంది. శంకర్ దర్శకత్వంలోని ‘ఆర్సీ 15’, బుచ్చిబాబు డైరెక్ట్ చేయబోతున్న ‘ఆర్సీ16’పై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.