సుక్కు సినిమాలో బన్ని క్యారక్టర్, స్టోరీ లైన్ ఇదే..?

By Udaya DFirst Published Mar 5, 2019, 9:24 AM IST
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా వచ్చి చాలా  కాలమే అవుతోంది.  త్రివిక్రమ్ తో మొదలు అవుతుందనుకున్న సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. అదింకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా వచ్చి చాలా  కాలమే అవుతోంది.  త్రివిక్రమ్ తో మొదలు అవుతుందనుకున్న సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. అదింకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఈలోగా బన్నీ ఇంకో కొత్త సినిమాను సెట్ చేసుకుని అఫీషియల్ గా ప్రకటించేసాడు.   ఇది బన్నీకి 20వ సినిమా కావడం విశేషం.  ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నాడు. 

సుకుమార్ గతంలో బన్నీతో కలిసి 'ఆర్య, ఆర్య 2' సినిమాలు చేశాడు.  వీటిలో ఆర్య 2 పర్వాలేదనిపించుకోగా ఆర్య మాత్రం కొత్త ట్రెండ్ సెట్ చేసింది.  ఆ సినిమాతోనే బన్నీకి స్టార్ ఇమేజ్ మొదలైంది.  మళ్ళీ ఈ ఇద్దరూ ముచ్చటగా మూడవ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో బన్ని పాత్ర ఏమిటి..కథ ఏమై ఉండవచ్చు అనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా మహేష్ బాబుకు అనుకున్న కథతోనే తయారు కానుందని సమాచారం. శేషాచలం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టు కథ తిరగనుందని సమాచారం. ఈ మేరకు సుకుమార్ చాలా మంది పోలీస్ అథికారులను కలిసి రీసెర్చ్ చేసి మరీ కథనం రెడీ చేసారని , పూర్తి యాక్షన్ తో నడిచే సినిమా అని తెలుస్తోంది. 

ఈ కథలో బన్ని పాత్ర...అడవి దొంగ  అని తెలుస్తోంది. ఇదో కమర్షియల్ ఎంటర్టైనర్  అని, అడవి దొంగ ఎలా ఎర్ర చందనం స్మర్గర్ల పనిపెట్టారనే పాయింటే సినిమా కథ అని చెప్తున్నారు. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.   

 

click me!