టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబయ్ లో ఇల్లు కొన్నారా. అందుకే ఎక్కవగా ముంబయ్ లో ఉంటున్నాడా.. ఈ వార్తల్లో నిజం ఎంత..? అసలలెందుకు ఈ న్యూస్ బయటకువచ్చింది..?
ఈమధ్య రామ్ చరణ్ ముంబయ్ ట్రిప్పులు ఎక్కువవుతున్నాయి. గ్లోబల్ స్టార్ అవ్వడంతో హైదరాబాద్ తో పాటు ముంబయ్ లో కూడా ఎక్కువ పనులు ఉంటాయ్ కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాడు చరణ్. ఈసారి ఏకంగా తన భార్య ఉపాసన... కూతురు క్లింకారతో కలిసి లాంట్ ట్రిప్ వేశాడు ముంబయ్ కి. అయితే అక్కడ చాలా పనులు చక్కబెట్టుకున్నాడు చరణ్. సీఎం ను కలవడం, దైవ దర్శనాలు.. మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోజులివ్వడం.. ఇలా చాలా పనులు చక్కబెట్టాడు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఉపాసన చరణ్ కలిసి అక్కడ ఓ ఇల్లు కూడా బేరం చేశారట. ముంబయ్ లో తాము వచ్చినప్పుడు ఉండటానికి ఇల్లు కొనబోతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం రామ్ చరణ్ గోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. నార్త్ లో కూడా చరణ్ కు మాంచి మార్కెట్ ఉంది. ఆర్ఆర్ఆర్ తో ఆయన ఫాలోయింగ్ నాలుగైదు రెట్లు పెరింగింది. దాంతో ఆయనకు ముంబయ్ లో కూడా పనులు ఎక్కువైపోయాయి. హిందీ నుంచి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా.. వాటిని ఓల్డ్ లో పెట్టాడు చరణ్. ఈమధ్య రాజ్ కుమార్ హిరాణి కూడా చరణ్ కు కథ చెప్పాడట. ఇలా బాలీవుడ్ తో చరణ్ బంధం బలపడుతుంది. దాంతో ముంబయ్ లో పనులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడల్లా రెంట్లు తీసుకోవడం కంటే.. ఓ ఇల్లు కొంటే సరిపోతుందని భావిస్తున్నారట మెగా ప్యామిలీ.
undefined
చరణ్ గ్లోబల్ స్టార్ కాకముందే.. ముంబయ్ లో ఇల్లు తీసుకోవాలి అనుకున్నారు. ఓ బాలీవుడ్ సినిమా చేసిన చరణ్ ఆ సినిమాతో ప్లాప్ ను ఫేస్ చేశారు. దాంతో ముంబయ్ లో ప్రాపర్టీ విషయం పక్కన పెట్టారు. ఇక మరోసారి ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ బాక్సఫీస్ లు బ్లాస్ట్ చేశాడు. దాంతో ముంబయ్ లో ఉండాల్సినఅవసరం వస్తోంది. ఇక మెగా ఫ్యామిలీకి హైదరాబాద్ తో పాటు.. చెన్నైలో కూడా ఆస్తులున్నాయి. బెంగళూరులో పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉంది. కాని ముంబయ్ లోనే ఆస్తులు లేవు. బాలీవుడ్ ను కేంద్రం అయిన ముంబయ్ లో ఇల్లు ఉంటే.. ముందు ముందు ఉపయోగపడుతుందని వీరు అనుకుంటున్నారట.
ఇక ముంబయ్ వెళ్లిన చరణ్ దంపతులు ఆపనులు కూడా చక్కబెట్టుకుని వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ముందు కొన్నిరోజులు అక్కడ.. కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక రాజ్ కుమార్ హిరాణి మూవీ కన్ ఫార్మ్ అయితే.. చాలా కాలం రామ్ చరణ్ ముంబయ్ లో మకాం వేయాల్సి వస్తుంది. అందుకే ఆ లోపు ఇల్లు కొనడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కాని.. న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.