నీహారిక కోసం చరణ్ ఫిష్ కర్రీ!

Published : May 14, 2018, 06:01 PM IST
నీహారిక కోసం చరణ్ ఫిష్ కర్రీ!

సారాంశం

రామ్ చరణ్ నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబసభ్యులతో మాత్రం

రామ్ చరణ్ నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబసభ్యులతో మాత్రం వీలైంత సమయం గడపాలనే చూస్తుంటాడు. అంతేకాదు అప్పుడప్పుడు వంటిట్లోకి దూరి రుచికరమైన వంటకాలు కూడా చేస్తుంటాడు. గతంలో చరణ్ తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం అల్పాహారం తయారు చేసారంటూ అతడి సతీమణి ఉపాసన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. తాజాగా చరణ్ తన చెల్లెలు నీహారిక కొణిదల కోసం ఫిష్ కర్రీ చేశారు.

ఈ సందర్భంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చరణ్.. ''నేను చేసిన ఫిష్ కర్రీ.. నీహారిక కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ చేశాను.. అంటూ రుచి చూసి అదిరిపోయింది''అన్నారు. ఈ ఏడాది రంగస్థలం చిత్రంతో ఘన విజయం అందుకున్న చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..
సర్జరీతో పాడైపోయిన పెదవులు, హీరోయిన్ పై దారుణంగా ట్రోలింగ్.. 9 నెలలు డిప్రెషన్ లో..