మహేష్ తో చరణ్ క్రిస్మన్ వేడుకలు!

Published : Dec 26, 2018, 10:21 AM IST
మహేష్ తో చరణ్ క్రిస్మన్ వేడుకలు!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు తమ కుటుంబాలతో కలిసి ఫారెన్ ట్రిప్ లకు వెళ్తుంటారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు తమ కుటుంబాలతో కలిసి ఫారెన్ ట్రిప్ లకు వెళ్తుంటారు. కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు.

మహేష్ కూతురు సితారని చరణ్ భార్య ఉపాసన ప్రేమగా చూసుకుంటుంది. మరోసారి ఈ రెండు ఫ్యామిలీలు కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాయి. మహేష్ బాబు అతడి భార్య నమ్రత, రామ్ చరణ్-ఉపాసనల జంట, మరికొంతమంది సన్నిహితులు కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన మహేష్, చరణ్ అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం మహేష్ 'మహర్షి' సినిమాతో బిజీగా గడుపుతున్నారు.

మరోపక్క రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలైన తరువాత చరణ్ పూర్తిగా రాజమౌళి చిత్రానికే సమయం కేటాయించనున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

2025లో వీరే తోపు బ్యాటర్లు.. టీమిండియాలో తురుమ్ ఖాన్లు.. లిస్టులో ఎవరున్నారంటే.?
'కమల్‌ హసన్‌తో విడిపోవడం వెనుక అసలు కారణం అదే.. ఆమెకు ఏం తెలియదు.!'