రాంచరణ్ లుక్ వైరల్.. అలా ఉందంటూ కామెంట్స్!

Published : Jun 05, 2019, 03:10 PM IST
రాంచరణ్ లుక్ వైరల్.. అలా ఉందంటూ కామెంట్స్!

సారాంశం

మెగా పవర్ సార్ రాంచరణ్, ఉపాసన ఇటీవల ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆఫ్రికా పర్యటనలో రాంచరణ్ దంపతులు ప్రకృతి అందాలని ఆస్వాదించారు. 

మెగా పవర్ సార్ రాంచరణ్, ఉపాసన ఇటీవల ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆఫ్రికా పర్యటనలో రాంచరణ్ దంపతులు ప్రకృతి అందాలని ఆస్వాదించారు. వివిధ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి అడవి జంతువులని వీక్షించారు. సింహం పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోలని కూడా ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవల ఉపాసన రాంచరణ్ కు సంబంధించిన మరి కొన్ని ఫోటోలని అభిమానులతో పంచుకుంది. 

ఈ ఫొటోల్లో రాంచరణ్ కౌబాయ్ హ్యాట్ ధరించి కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలు అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాంచరణ్ లుక్ కొదమ సింహం చిత్రంలో చిరంజీవి కౌబాయ్ గెటప్ ని గుర్తు చేసేలా ఉండంతో కామెంట్స్ చేస్తున్నారు. రాంచరణ్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతా రామరాజు గెటప్ మీసకట్టు పెంచి కనిపిస్తున్నాడు. 

ఆఫ్రికా పర్యటన ముగించుకున్న చరణ్, ఉపాసన హైదరాబాద్ చేరుకున్నారు. త్వరలో ఆర్ఆర్ఆర్ భారీ షెడ్యూల్ లో రాంచరణ్ పాల్గొననున్నాడు. మరోవైపు రాంచరణ్ నిర్మాతగా సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు