తమ్ముడి కోసం రామ్ చరణ్!

By Udayavani DhuliFirst Published Dec 17, 2018, 1:13 PM IST
Highlights

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. 

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. డిసెంబ‌ర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దీనికి ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు.

అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో అంత‌రిక్షం 9000 kmph సినిమాను తెర‌కెక్కించారు సంక‌ల్ప్ రెడ్డి. తాజాగా విడుద‌లైన ఆడియో.. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. వ‌రుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకున్నారు.

జ్ఞాన‌శేఖ‌ర్ విఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

న‌టీన‌టులు:

వ‌రుణ్ తేజ్, అదితిరావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి, స‌త్య‌దేవ్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల 

సాంకేతిక విభాగం: 

ద‌ర్శ‌కుడు: స‌ంక‌ల్ప్ రెడ్డి

నిర్మాత‌లు: రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి

నిర్మాణ సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ 

సినిమాటోగ్ర‌ఫీ: జ‌్ఞాన‌శేఖ‌ర్ విఎస్ (బాబా)

ఎడిట‌ర్: కార్తిక్ శ్రీ‌నివాస్ 

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్: రామ‌కృష్ణ సబ్బ‌ని, మోనిక నిగొత్రే స‌బ్బ‌ని 

సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్ విహారి 

స్టంట్స్: ట‌డోర్ ల‌జ‌రోవ్ 

సిజి: రాజీవ్ రాజ‌శేఖ‌రన్ 

 

click me!