జపాన్ అభిమానుల మధ్య రామ్ చరణ్ సందడి, ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్న ఫ్యాన్స్..

Published : Oct 19, 2022, 04:09 PM IST
జపాన్ అభిమానుల మధ్య రామ్ చరణ్ సందడి, ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్న ఫ్యాన్స్..

సారాంశం

జపాన్ అభిమానుల మధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. జపాన్ లో ఆయన ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి. 

టాలీవుడ మెగా పవర్ స్టార్  రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలసి జపాన్ లో సందడి చేస్తున్నారు. అక్కడ ని ఓ రెస్టారెంట్ లో ఇద్దరు ప్రత్యక్షమయ్యారు.  అంతే కాదు అక్కడి అభిమానులతో కలసి  డిన్నర్ కూడా చేశారు. దీనికి సబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జపాన్ లో ఈ ఇద్దరు తారలు ఏం చేస్తున్నారనే కదా డౌట్.. ఆర్ఆర్ఆర్ సినిమా చూడటానికి జపాన్ వెళ్లారు.. 

అవును వింటానికి విచిత్రంగా ఉన్నా.. అది నిజం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్  కొమురం భీమ్  పాత్రధారులుగా వచ్చిన  సినిమా ఆర్ఆర్ఆర్. ఈ  సినిమా ఇండియాలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. వెయ్యి కోట్లు దాటి కలెక్షన్ల వరద పారించిన ట్రిపుల్ ఆర్ సినిమాను కాస్త లేట్ గా అయినా.. మన తెలుగు సినిమాలు అంటే డిమాండ్ ఉన్న జపాన్ లో  వచ్చే శుక్రవారం రిలీజ్ చేయబోతున్నారు.  ఈ కార్యక్రమం కోసం రామ్ చరణ్ తన భార్యతో కలసి మంగళవారం జపాన్ వెళ్లాడు.

జపాన్ పర్యటన విశేషాల ఫొటోలను ఉపాసన తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. జపనీస్ అభిమానులతో  వీరు రెస్టారెంట్ లో కలిసి విందు పార్టీ చేసుకున్నారు. ఫ్యాన్స్ అందరూ నవ్వులు చిందిస్తున్న ఫొటోను ఉపాసన పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు  దిల్ ఖుష్ అవుతున్నారు. మెగా ప్యాన్స్ పండగచేసుకుంటున్నారు. మనోడి ఖ్యాతి జపాన్ వరకూ వెళ్ళిందని తెగ సంతోషిస్తున్నారు. 

జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తదితరులు పాల్గొననున్నారు. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి జపాన్ వెళ్లాడు. ఆయన ఏయిర్ పోర్ట్ లో ఫ్యామిలీతో కనిపించిన విడియోస్ తెగ వరల్ అయ్యాయి. ఇక ఈ శుక్రవారం ఆర్ఆర్ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి.. సక్సెస్ టాక్ తె చ్చుకుంటే చాలు.. మన తెలుగు హీరోలు మరో ఇద్దరికి అక్కడ మార్కెట్ పెరిగినట్టే. ఇప్పటికే బహుబలి పుణ్యమా అని ప్రభాస్ కు ఆల్ రెడీ జపాన్ లో పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. 

ఆలియా భట్, ఒలీవియో హీరోయిన్లు గా  నటించిన ఆర్ఆర్ఆర్  ప్రపంచవ్యాప్తంగా 1,000 కోట్ల వసూళ్లతో  సంచలనం సృష్టించింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తో పాటు శ్రీయ శరణ్,లాంటి ప్రముఖులు కనిపించారు. ఇక జపాన్ తో ప్రస్తుతం రిలీజ్ చేయబోతున్నారు. త్వరలో చైనాలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యే చన్స్ కనిపిస్తుంది. 
 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ