లండన్ లో మెగా ఫ్యామిలీ, అరుదైన గౌరవం పొందనున్న రామ్ చరణ్

అరుదైన గౌరవాన్ని అందుకునేందుకు ఫ్యామిలీతో పాటు లండన్ చేరుకున్నారు రామ్ చరణ్.  మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన వారి గారాల కూతురు క్లింకార లండన్ లో సందడి చేశారు. 

Google News Follow Us

మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో  రామ్ చరణ్ ఓ అరుదైన గౌరవాన్ని పొందబోతున్నాడు. అందుకోసం ఆయన తన ఫ్యామిలీతో కలిసి  లండన్‌ చేరుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఈవెంట్ కోసం  మెగా ఫ్యామిలీ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అంతే కాదు మెగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ ను చూడటానికి వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. 

రామ్ చరణ్‌కు దక్కబోయే  ఈ అరుదైన గౌరవాన్ని దగ్గరుండి చూడటానికి మెగా ప్యామిలీ అంతా లండన్ వెళ్ళారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ తో పాటు.. రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, కూతురు క్లింకారా, వారి పెట్ డాగ్ కూడా లండన్ వెళ్లడం విశేషం. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్  మైనపు విగ్రహాన్ని తమ మ్యూజియంలో స్థానం కలిపించారు మేడమ్ టుస్సాడ్స్ టీమ్.  అంతే కాదు రామ్ చరణ్ విగ్రహం ఆయన తన  పెట్ డాగ్ ను ఎత్తుకుని ఉన్నట్టుగా పెడుతుండటం మరోవిశేషం. 

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలకు లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎంతో ప్రసిద్ధి. ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియంలో  ఇప్పటికే పలువురు సెలబ్రిటీల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్,  బాలీవుడ్ నుంచి అమితాబ్, షారుఖ్,  లాంటి స్టార్స్ మైనపు విగ్రహాలు ఇప్పటికే అక్కడ  ఉన్నాయి. ఇక ఇప్పుడు అందులో రామ్ చరణ్ విగ్రహం కూడా చేరబోతోంది. 

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటుంది.  ఈమూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక ఈసినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో మరో మూవీ చేయబోతున్నారు రామ్ చరణ్. 

Read more Articles on