#RamCharan:మళయాళ చిత్రం రీమేక్ రైట్స్ కొన్న చరణ్, ఎవరికోసం అంటే

By Surya PrakashFirst Published Oct 7, 2022, 2:41 PM IST
Highlights

ఈ వీకెండ్ వరకు విజయదశమి సెలవులు ఉన్నాయి. అప్పటి వరకు సినిమా బాక్సాఫీస్ బరిలో సినిమా హవా ఉంటుందంటున్నారు. మెగాస్టార్ అభిమానుల జోరు చూస్తుంటే వీకెండ్ వరకు మంచి కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి.


రీమేక్ చిత్రాలు చిరంజీవి కలిసొస్తున్నాయి. తాజాగా మళయాళ చిత్రం లూసీఫర్ రీమేక్ గా రూపొందిన గాఢ్ ఫాధర్ చిత్రం సూపర్ హిట్టైంది.  ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం గాడ్ ఫాద‌ర్‌. ఈ చిత్రం విడుద‌లైన రోజు నుంచే మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే విమర్శకుల నుంచి హిట్ రివ్యూస్ వచ్చాయి. సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. 

దసరా సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ సినిమా బుధవారం విడుదలైంది. ఈ వీకెండ్ వరకు విజయదశమి సెలవులు ఉన్నాయి. అప్పటి వరకు సినిమా బాక్సాఫీస్ బరిలో సినిమా హవా ఉంటుందంటున్నారు. మెగాస్టార్ అభిమానుల జోరు చూస్తుంటే వీకెండ్ వరకు మంచి కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ మరో చిత్రం రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆ చిత్రం కూడా మళయాళంలో సూపర్ హిట్టైన చిత్రం కావటం విశేషం. ఆ సినిమా మరేదో కాదు..భీష్మ పర్వం. 

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సాధించింది.   ముంబై నేపథ్యంలో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 4న విడుదలైన ఈ సినిమాకు సంచలన ఓపెనింగ్స్ వచ్చాయి. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో భీష్మ పర్వం కూడా చేరిపోయింది. ఇందులో అత్యంత కీలకమైన పాత్ర చేసింది అనసూయ. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం నాలుగు రోజుల్లోనే 52 కోట్ల గ్రాస్ వసూలు చేసి కేరళ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది భీష్మ పర్వం.  

 విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్ళ పరంగాను దుమ్ముదులిపింది. కేరళలో ఫస్ట్ వీకెండ్ వసూళ్ళలో రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకూ ఆ రికార్డ్ మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ పేరుమీద ఉంది.   మోహన్ లాల్ రికార్డ్ ను మమ్ముట్టి స్మాష్ చేసేశాడు. అమల్ నీరద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు అనసూయ, నదియా, శ్రీనాద్, ఫర్హాన్ ఫాజిల్ నెడుముడి వేణు, అరుణ్ కుమార్ నటించారు.  ఇప్పటి వరకూ మలయాళ పరిశ్రమలో అత్యధిక తొలి వారాంతపు వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలుగా ‘భీష్మ పర్వం’, ‘లూసిఫర్’, ‘బాహుబలి 2’, ‘కాయం కులం కొచ్చున్ని’, ‘ఒడియన్’ నిలిచాయి. అనసూయ నటించిన తొలి మలయాళ చిత్రమిది.  
 

click me!