రామ్ చరణ్ సంతోషం.. చిన్ని క్లింకారతో మెగాఇంట తొలి వినాయక చవితి.. మెగాపవర్ స్టార్ ప్రత్యేకమైన పోస్ట్

మెగాప్రిన్సెస్ క్లింకార పుట్టాక మెగాస్టార్ చిరంజీవి ఇంట తొలివినాయక చవితి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కొన్ని ఫొటోలను పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

Ram Charan Happy for Celebrating the First Festival with the little klin Kaara NSK

గణేశ్ చతుర్థి సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ప్రతిమను పూజగదిలో ప్రతిష్టించి విఘ్నేశ్వరుడి పూజలో పాల్గొన్నారు. చిరంజీవి, సురేఖ, కూతురు శ్రీజా, సుష్మితా తో పాటు మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ (Ram Charan), భార్య ఉపాసన కొణిదెల, కూతురుతో  కలిసి పూజలు నిర్వహించారు. గణనాథుడి విగ్రహాన్ని ప్రత్యేక అలకరంణతో కొలిచారు. కుటుంబ సభ్యులంతా సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయారు. 

అయితే, మెగా ప్రిన్సెస్ క్లింకార (Klin Kaara)  జన్మించిన తర్వాత మెగాఇంట తొలి వినాయక చవితి కావడంతో కుటుంబ సభ్యులు మరింత ప్రత్యేకంగా గణేశుడికి పూజలు చేశారు. కూతురుతో కలిసి మొదటి గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొనడం పట్ల రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు పూజ గది నుంచి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ప్రత్యేకమైన పోస్టు పెట్టారు. 

Latest Videos

రామ్ చరణ్ పోస్టులో..  కుటుంబ సభ్యులంతా ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. తమ ఇంట్లో గణేశుడిని కొలిచిన తీరును తెలియజేశారు. అదేవిధంగా ప్రత్యేకమైన నోట్ రాస్తూ... ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి మా ఇంట్లో ప్రత్యేకత... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం ఆనందంగా ఉంది.’ అంటూ క్యాప్షన్ లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరంజీవి కుటుంబ సభ్యులంతా ఓకే చోట కనిపించడంతో అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ఇక చరణ్ కూ అభిమానులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అటు చిరంజీవి రీసెంట్ గానే ‘భోళా శంకర్’తో అలరించారు. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు. 

 

vuukle one pixel image
click me!