రామ్‌చరణ్‌లోని అల్లరి, చిలిపితనానికి కారణం బాబాయ్‌ పవనేనా?... చిరంజీవి చెప్పింది నిజమేనా?

Published : Apr 24, 2022, 09:29 AM ISTUpdated : Apr 24, 2022, 09:32 AM IST
రామ్‌చరణ్‌లోని అల్లరి, చిలిపితనానికి కారణం బాబాయ్‌ పవనేనా?... చిరంజీవి చెప్పింది నిజమేనా?

సారాంశం

యాంకర్‌ సుమ చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాలకు కొన్ని ప్రశ్నలు సంధించింది. దానికి చిరంజీవి, చరణ్‌, కొరటాల సమాధానం చెప్పారు. ఇందులో పలు ఫన్నీ ప్రశ్నలు, సమాధానాలుండటం విశేషం.

ఎప్పుడూ సైలెంట్‌గా కనిపించే రామ్‌చరణ్‌(Ram Vharan) లోనూ చిలిపితనం ఉందట. అల్లరి తనానికి కొదవే లేదట. దానికి కారణం మాత్రం బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). రామ్‌చరణ్‌తో కలిసి ఆయన నటించిన చిత్రం `ఆచార్య`(Acharya). కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతుంది. కాజల్‌, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. 

ఇందులో కొరటాల శివ, రామ్‌చరణ్‌, రాజమౌళి, చిరంజీవి మాట్లాడేందుకు ముందు యాంకర్‌ సుమ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాలకు కొన్ని ప్రశ్నలు సంధించింది. దానికి చిరంజీవి, చరణ్‌, కొరటాల సమాధానం చెప్పారు. ఇందులో పలు ఫన్నీ ప్రశ్నలు, సమాధానాలుండటం విశేషం. ఇందులో అమ్మచేతి వంటకి మించిన తీయదనం మరెందులోనూ ఉండదని చిరంజీవి చెప్పారు. చిరంజీవి,చరణ్‌లో బెస్ట్ డాన్సర్‌ ఎవరు అని అడిగిన ప్రశ్నకి, నాన్నగారే అని చరణ్‌ చెబుతుండగా, మధ్యలో కల్పించుకున్న చిరు..`నా పేరు శివ శంకర వరప్రసాద్‌. శివుడు నృత్యానికి ప్రసిద్ధి. శివుడి ముందు ఎంతమంది డాన్స్‌ వేసిన అది డాన్స్‌ అనుకుంటారు తప్ప... శివతాండవం తర్వాతే ఏదైనా. ఎవరైనా! అప్పుడప్పుడూ చరణ్‌లాంటి వాళ్లను ఎంకరేజ్‌ చేయాలి కాబట్టి తగ్గుతూ ఉంటా` అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. 

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ ఇంట్లో `ఆచార్య` ఎవరని రామ్‌చరణ్‌ని అడగ్గా, దీనికి సమాధానం చెప్పడం కష్టమన్నారు చరణ్‌. అయితే తన నుంచి క్రమశిక్షణ, బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ నుంచి అల్లరి, చిలిపితనం నేర్చుకున్నాడని చెప్పారు చిరంజీవి. ఈ సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడూ సైలెంట్‌గా, హుందాగా కనిపించే రామ్‌చరణ్‌లో చిలిపితనం, అల్లరి తనం కూడా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రెస్‌మీట్‌లోనూ రాజమౌళి.. చరణ్‌ గురించి కూడా ఇదే చెప్పారు. అంతేకాదు పవన్‌ కళ్యాణ్‌ కూడా సైలెంట్‌గానే ఉంటారు. కానీ చిరంజీవి మాత్రం చరణ్‌లో అల్లరి, చిలిపితనం ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

ఇదిలా ఉంటే మరో షాకింగ్‌ క్వచ్చన్‌ సంధించింది యాంకర్‌ సుమ. ఇంట్లో ఎవరికి భయపడతారు చిరంజీవి? ఉపాసన? అని అడగ్గా, చరణ్‌ స్పందిస్తూ నాన్న చిరంజీవి అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు, నేను కూడా అదే నేర్చుకుని  ఉపాసన ముందు జాగ్రత్తగా ఉంటాను` అని తెలిపారు చరణ్‌. దీంతో `ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌` ప్రాంగణం మొత్తం అభిమానుల అరుపులతో దద్దరిల్లింది. ఇక `ఆచార్య` చిత్రంలోని ఆచార్య పాత్ర, సిద్ధ పాత్రలో ఏదంటే ఇష్టమని చిరంజీవి అడగ్గా, రెండు పాత్రలు ముందు పెడితే తాను సిద్ధ పాత్రనే చేస్తానని తెలిపారు. ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని వెల్లడించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు