The Warrior Movie : ‘ది వారియర్’లోని ఒక్క సాంగ్ కే అంత ఖర్చా.? ఎన్ని కోట్లు పెట్టారో తెలిస్తే షాకే.!

Published : Apr 24, 2022, 07:30 AM IST
The Warrior Movie : ‘ది వారియర్’లోని ఒక్క సాంగ్ కే అంత ఖర్చా.? ఎన్ని కోట్లు పెట్టారో తెలిస్తే షాకే.!

సారాంశం

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు ఎన్ లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ డ్రామా ‘ది వారియర్’. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ అయిన ‘బుల్లెట్’ సాంగ్ కోసం మేకర్స్ ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాకవ్వాల్సిందే.   

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), దర్శకుడు ఎన్ లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ డ్రామా ‘ది వారియర్’ (The Warrior). ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలత తర్వాత మరోసారి మాస్ విజువల్స్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో రామ్. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్స్ కూడా సినిమాలో బోలెడంత మాస్ కంటెంట్ ఉన్నట్టు చూపిస్తున్నాయి. అయితే ఇటీవల ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘బుల్లెట్’ (Bullet) సాంగ్ ను రిలీజ్ చేశారు. 

ఈ ఎనర్జిటిక్ బుల్లెట్ సాంగ్ కు దేవీ శ్రీ ప్రసాద్ క్యాచీ టూన్ అందించగా.. తమిళ యాక్టర్ శింబు (Simbu), హరిప్రియ అద్భుతంగా పాడారు. శ్రీ మణి ఈ సాంగ్ కు అదిరిపోయే లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ సూపర్ సాంగ్ య్యూటూబ్ లో ట్రెండింగ్ లో  ఉంది. ఈ రొమాంటిక్ సాంగ్ తో రామ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సాంగ్ మేకింగ్ కోసం మేకర్స్ ఏకంగా కోట్లల్లో ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఒక్క సాంగ్ కోసమే రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. మరోవైపు తమిళ యాక్టర్ శింబుతో పాడించడం, మంచి విజువల్స్ ను చూపించేందుకు తగిన సెట్లు వేయించేందుకు ఇంతలా ఖర్చు అయినట్టు తెలుస్తోంది.

ఏదేమైనా ది వారియర్ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది. మరోవైపు వచ్చే నెలలో రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా మరో ఎక్జైటింగ్ అప్డేట్ రానున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో రామ్ ప్రధాన పాత్ర  పోషిస్తుండగా.. హీరోయిన్ గా  యంగ్ అండ్ టాలెంటెడ్ కృతి శెట్టి (Kriti Shetty) నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. జులై 14న వరల్డ్ వైడ్ ‘ది వారియర్’ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?