ముంబై మీడియా కోరిక.. కూల్ గా ఆన్సర్ ఇచ్చిన రాంచరణ్!

Published : Aug 20, 2019, 06:12 PM IST
ముంబై మీడియా కోరిక.. కూల్ గా ఆన్సర్ ఇచ్చిన రాంచరణ్!

సారాంశం

మంగళవారం రోజు విడుదల చేసిన టీజర్ తో మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్ర సందడి మొదలయింది. టీజర్ అద్భుతంగా ఉండడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్ర యూనిట్ ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది. 

మంగళవారం రోజు విడుదల చేసిన టీజర్ తో మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్ర సందడి మొదలయింది. టీజర్ అద్భుతంగా ఉండడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్ర యూనిట్ ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో సైరా చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో రాంచరణ్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు ఎందుకు బాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉంటున్నారు.. మిమ్మల్ని బాలీవుడ్ లో కూడా చూడాలనుకుంటున్నాం అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. నేనేమి దూరంగా ఉండడం లేదు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా. ఎక్కడ సినిమా చేసినా కథే ముఖ్యం. అలాంటి కథలు వస్తే బాలీవుడ్ లో కూడా నా సినిమాలు ఉంటాయి. 

ప్రస్తుతం రాజమౌళి గారి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నా. బాలీవుడ్ లో అదే నా కం బ్యాక్ మూవీ అని రాంచరణ్ తెలిపాడు. ఇక సైరా చిత్రంలో తాను ఎలాంటి రోల్ పోషించలేదని, తాను కేవలం నిర్మాతని మాత్రమే అని రాంచరణ్ తెలిపాడు. దిగ్గజ నటులంతా ముందుకు రావడం వల్లే ఈ భారీ ప్రాజెక్ట్ సాధ్యమైందని రాంచరణ్ తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?