#RC15: 'సలార్' మోడల్ లో ‘గేమ్‌ ఛేంజర్‌’?అందుకే ప్రమోషన్స్ ఆపారా?

Published : Aug 28, 2023, 07:13 AM IST
 #RC15: 'సలార్' మోడల్ లో ‘గేమ్‌ ఛేంజర్‌’?అందుకే ప్రమోషన్స్ ఆపారా?

సారాంశం

 ఈ బిజినెస్ ప్లాన్ కు శంకర్, రామ్ చరణ్ ఓకే చెప్పాల్సి ఉంది. అందుకే ప్రమోషన్ స్టార్ట్ చేయటం లేదని తెలుస్తుంది. ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చాక అప్పుడు టీజర్, ట్రైలర్ వంటివి వదలుతారని తెలుస్తోంది.  


రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తోన్న కొత్త సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ఏ రేంజిలో క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే కొన్ని షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న దీని అప్‌డేట్స్‌ కోసం రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు శంకర్‌ షూటింగ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ అనీఫిషియల్ గా సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చిందచి.  దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ ట్రెండింగ్‌లోకి వచ్చింది.ఏమిటా అప్డేట్

శంకర్ దర్శకత్వంలో ‘దిల్‌’రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని సలార్ బిజినెస్ మోడల్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే బాగా పెరిగిపోయిన ప్రొడక్షన్ కాస్ట్ ని రికవరీ అవ్వాలంటే రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తే బెస్ట్ అని ఆలోచిస్తున్నారట. దాంతో దిల్ రాజు ఈ ప్రపోజల్ శంకర్, రామ్ చరణ్ ముందు పెట్టారట. మొదట రెండు పార్ట్ లు ఐడియా ఉన్నా కథ సపోర్ట్ చేయదని ఆగారట. కానీ ఇప్పుడు కథను విస్తరించి సరైన ప్లేస్ లో ఫస్ట్ పార్ట్ బ్రేక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో  టీమ్ ఉందిట. ఇప్పటికే ఈ సినిమా మాసివ్ బడ్జెట్ అయ్యిపోయింది. ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉంది. 

బయిట పెరిగిన ఖర్చులో ప్రతీది రెట్టింపు అవుతోంది. అలాగని సినిమా ను చిన్నది చేయలేము. భారీ బడ్జెట్ పెట్టి చేసి భారీ రేట్లు పెట్టి అమ్ముదామంటే బిజినెస్ కష్టమైపోతుంది. అదే రెండు పార్ట్ లు చేస్తే  ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం మొదటి పార్ట్ లో రికవరీ చేయచ్చు.సెకండ్ పార్ట్ కు లాభాలు చూడవచ్చు అనేది దిల్ రాజు ఆలోచనగా చెప్తున్నారు. అయితే ఈ బిజినెస్ ప్లాన్ కు శంకర్, రామ్ చరణ్ ఓకే చెప్పాల్సి ఉంది. అందుకే ప్రమోషన్ స్టార్ట్ చేయటం లేదని తెలుస్తుంది. ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చాక అప్పుడు టీజర్, ట్రైలర్ వంటివి వదలుతారని తెలుస్తోంది.  

ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరిగింది. చరణ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఆగస్టు 21తో ఈ షెడ్యూల్‌ ముగిసింది. ఈ సినిమాలో చరణ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్‌.   ఇక శంకర్‌-రామ్‌ చరణ్‌ కాంబో అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మూవీ నిర్మాణంలో కూడా శంకర్‌ ఎక్కడ రాజీ పడడనే విషయం తెలిసిందే.  దిల్‌ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్‌ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట.  ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..