‘భైరవద్వీపం’ రీరిలీజ్‌.. 4K ట్రైలర్‌..అదరకొట్టారు చూశారా?

Published : Aug 28, 2023, 06:42 AM IST
 ‘భైరవద్వీపం’ రీరిలీజ్‌.. 4K ట్రైలర్‌..అదరకొట్టారు చూశారా?

సారాంశం

‘భైరవద్వీపం’ సినిమాను ఆగస్టు 30న రీరిలీజ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించి 4K ట్రైలర్‌ను తాజగా విడుదల చేశారు.


బాలయ్య  (Balakrishna) కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో ఒకటి ‘భైరవద్వీపం’ (Bhairava Dweepam). ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ జానపద చిత్రం..అప్పట్లోనే కాదు ఇప్పటికీ  యూట్యుబ్ లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ సినిమాలో ఈ చిత్రాన్ని రీరిలిజ్ కు ప్లాన్ చేసారు.  రోజా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. రంభ పాత్రలో కనపడుతుంది. బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘భైరవద్వీపం’ సినిమాను ఆగస్టు 30న రీరిలీజ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించి 4K ట్రైలర్‌ను తాజగా విడుదల చేశారు. ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేసి వదలటంతో మంచి రెస్పాన్స్ వస్తోంది.
 
 1993 నాటి ఈ  బ్లాక్‌ బస్టర్ భైరవ ద్వీపం 4K ఫార్మాట్‌లో ఆగస్ట్ 5, 2023న రీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనుకోని సమస్యల కారణంగా రీ రిలీజ్ వాయిదా వేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ నుండి చంద్ర శేఖర్ కుమారస్వామి మరియు పి దేవ్ వర్మ ఈ టైమ్‌లెస్ క్లాసిక్‌ని బెస్ట్ 4K క్వాలిటీ తో రీ రిలీజ్ చేసే ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌లో కైకాల సత్యనారాయణతో, విజయకుమార్, రంభ, విజయ రంగరాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబు మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మాధవపెద్ది సురేష్ సంగీతాన్ని సమకూర్చారు. చందమామ విజయ కంబైన్స్‌పై బి వెంకటరామి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 9 నంది అవార్డులను సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని,  ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను సాధించింది.

ప్రస్తుతం బాలకృష్ణ ప్రధాన పాత్రలో, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా భగవంత్ కేసరి. ఈ చిత్రం అక్టోబర్ 19, 2023 న విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి