శ్రీవారి సేవలో రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు.. కూతురు క్లీంకార పుట్టాక మొదటి సారి తిరుమల దర్శనం..

Published : Mar 27, 2024, 06:39 AM ISTUpdated : Mar 27, 2024, 06:41 AM IST
శ్రీవారి సేవలో రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు.. కూతురు క్లీంకార పుట్టాక మొదటి సారి తిరుమల దర్శనం..

సారాంశం

రామ్‌ చరణ్‌, ఉపాసన తిరుమలలో సందడి చేశారు. కూతురు క్లీంకారతో కలిసి ఈ ఉదయాన్నే తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు.   

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తిరుమలలో సందడి చేశారు. నేడు పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మార్నింగ్‌ సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. తన బర్త్ డే సందర్భంగా ఆయన సతీసమేతంగా వెంకటేశ్వరస్వామి ఆశిస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. 

తన పుట్టిన రోజుని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రమే తిరుమలకి చేరుకున్నారు రామ్‌ చరణ్‌ దంపతులు. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి స్థానిక అభిమానులు భారీగా అక్కడికి తరలి వచ్చారు. ఎయిర్‌ పోర్ట్ నుంచే ఆయనకు స్వాగతం పలికారు. మరోవైపు తిరుమలలోనూ వారంతా సందడి చేయడం విశేషం. దీంతో కోలాహలం నెలకొంది. కూతురు క్లీంకార జన్మించిన తర్వాత మొదటిసారి రామ్‌చరణ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. 

ఇక ప్రస్తుతం రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతుంది. ఇందులో చరణ్‌ ద్విపాత్రాబినయం చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్‌గా కనిపిస్తాడట. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి మొదటిపాటని విడుదల చేయబోతున్నారు. 

`జరగండి జరగండి`అంటూ సాగే మొదటి పాటని ఈ ఉదయాన్నే  విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేయగా, అది ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసింది. మరోవైపు తన బర్త్ డే సందర్భంగా రామ్‌ చరణ్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ `మగధీర`ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?