`ఆచార్య` సెట్‌లోకి రామ్‌చరణ్‌.. `సిద్ధ`గా ఎంట్రీతోనే గుస్‌బమ్స్

Published : Jan 17, 2021, 10:32 AM IST
`ఆచార్య` సెట్‌లోకి రామ్‌చరణ్‌.. `సిద్ధ`గా ఎంట్రీతోనే గుస్‌బమ్స్

సారాంశం

చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన సెట్‌లోకి అడుగుపెట్టారు. ఆదివారం రామ్‌చరణ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన సెట్‌లోకి అడుగుపెట్టారు. ఆదివారం రామ్‌చరణ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. `మా `సిద్ధ` సర్వం సిద్ధం` అంటూ దర్శకుడు కొరటాల శివ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా టెంపుల్‌ టౌన్‌ లొకేషన్‌లో రామ్‌చరణ్‌ అడుగుపెడుతున్నట్టుగా బ్యాక్‌ నుంచి తీసిన ఓ ఫోటోని పంచుకున్నారు. 

అలాగే చిత్ర బృందం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో రామ్‌చరణ్‌ `సిద్ధ` అనే పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. చెవికి రింగ్‌, మెడలో మాలతో కాషాయ రంగు షర్ట్ వేసుకుని కనిపిస్తున్నాడు రామ్‌చరణ్‌ చరణ్‌. దీంతో ఆయన పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ స్వామి మాలలో ఉన్న విషయం తెలిసిందే. ఇక చిరంజీవి సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌ రెడ్డి,రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా కోసం ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్‌ టౌన్‌ సెట్‌ని వేశారు. ఇటీవల ఆ సెట్‌ వీడియో తీసి చిరంజీవి తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. అది కనువిందుగా ఉంటుందని వెల్లడించారు. ఇందులో చరణ్‌ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ప్రభాస్ 'స్పిరిట్'లో మెగాస్టార్ చిరంజీవి ?.. ఎలాంటి పాత్రో తెలుసా, థియేటర్లు తగలబడిపోతాయి
డబ్బు కోసమే అల్లు అర్జున్ తో సినిమా, కార్తీని అందుకే వదిలేశాడా.. క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్