క్వారెంటైన్‌ మూమెంట్స్‌.. కోడలితో మెగా పవర్‌ స్టార్‌ డ్యాన్స్‌

By Satish ReddyFirst Published Aug 4, 2020, 2:13 PM IST
Highlights

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాను ఈ ఖాళీ సమయాన్ని ఎలా ఎంజాయ్  చేస్తున్నాడో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇంట్లో తన కోడలు నవిష్క (చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, హీరో కళ్యాణ్ దేవల కూతురు)తో కలిసి స్టెప్స్‌ వేస్తూ కలిపించాడు. టీవీలో చిన్న పిల్లలకు సంబంధించిన డ్యాన్స్ వీడియోను ప్లే చేస్తూ ఆ వీడియోకు తగ్గట్టుగా నవిష్కను డ్యాన్స్‌ చేయాలని ఎంకరేజ్‌ చేస్తూ కనిపించాడు చెర్రీ.

లాక్‌ డౌన్‌ కారణంగా సినీ తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చినా కేసులు భారీ సంఖ్యలె నమోదు అవుతుండటంతో తిరిగి షూటింగ్‌లు ప్రారంభించే ధైర్యం చేయలేకపోతున్నారు తారలు. దీంతో ఈ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు అభిమానులకు తమ ఫ్యామిలీ టైంకు సంబంధించిన మూమెంట్స్‌ను అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు.

తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాను ఈ ఖాళీ సమయాన్ని ఎలా ఎంజాయ్  చేస్తున్నాడో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇంట్లో తన కోడలు నవిష్క (చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, హీరో కళ్యాణ్ దేవల కూతురు)తో కలిసి స్టెప్స్‌ వేస్తూ కలిపించాడు. టీవీలో చిన్న పిల్లలకు సంబంధించిన డ్యాన్స్ వీడియోను ప్లే చేస్తూ ఆ వీడియోకు తగ్గట్టుగా నవిష్కను డ్యాన్స్‌ చేయాలని ఎంకరేజ్‌ చేస్తూ కనిపించాడు చెర్రీ.

చరణ్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోరాట యోధుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు చరణ్‌. ఎన్టీఆర్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మేన‌కోడ‌లితో స్టెప్పులేసిన రామ్‌‌ చరణ్‌ pic.twitter.com/Dfjj75J1PY

— Asianetnews Telugu (@asianet_telugu)
click me!