అడవిలో అన్నలుగా చిరు చరణ్... సోషల్ మీడియాలో క్రేజీ పిక్ వైరల్

Published : Aug 04, 2021, 04:36 PM IST
అడవిలో అన్నలుగా చిరు చరణ్... సోషల్ మీడియాలో క్రేజీ పిక్ వైరల్

సారాంశం

 ఆచార్య సెట్స్ నుండి చిరు, చరణ్ కలిసి ఉన్న ఫోటో పంచుకున్నారు చిత్ర యూనిట్. నక్సల్స్ గెటప్స్ లో ఉన్న చిరు, చరణ్ ఫోటో సినిమాపై ఆసక్తి పెంచేదిగా ఉంది. 


మొదటిసారి పూర్తి స్థాయి మల్టీ స్టారర్ చేస్తున్నారు చిరంజీవి, చరణ్. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఆచార్య టాకీ పార్ట్ పూర్తి కాగా, కేవలం రెండు సాంగ్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. రెండు పాటల చిత్రీకరణతో ఆచార్య షూటింగ్ పూర్తి కానుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు. 


ఇక ఆచార్య సెట్స్ నుండి చిరు, చరణ్ కలిసి ఉన్న ఫోటో పంచుకున్నారు చిత్ర యూనిట్. నక్సల్స్ గెటప్స్ లో ఉన్న చిరు, చరణ్ ఫోటో సినిమాపై ఆసక్తి పెంచేదిగా ఉంది. అర్థ గంటకు పైగా ఉండే సిద్దా అనే పాత్రను చరణ్ చేస్తున్నారు. ఇక చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఆచార్యలో చిరుకి జంటగా మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. 
 

సామాజిక సబ్జెక్టుకి కమర్షియల్ అంశాలు జోడించి కొరటాల శివ ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ విడుదల కాగా ఆకట్టుకుంది. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. నటుడు సోనూ సూద్, నటి సంగీత కీలక రోల్స్ చేస్తున్నారు. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఆచార్య వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఆచార్య విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. మరి కొద్దిరోజులలో చిరు బర్త్ డే నేపథ్యంలో మూవీ విడుదలపై అప్డేట్ రానుంది. 

PREV
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు