కొద్ది కాలం క్రితం వరకూ ఈ సినిమాలో చరణ్ అటుఇటుగా 25 నిమిషాలు కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా ట్రేడ్ లో బిజినెస్ పరంగా ఆ క్యారక్టర్ గురించి తెలుసుకుని లెక్కలు వేసుకోవటానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఈ ఎలిమెంట్ పై దర్శకుడు కొరటాల శివ స్పందించాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’ . అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్,పాట ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. రామ్‌చరణ్ ప్రత్యేక పాత్రలో (సిద్ధ) నటిస్తుండగా ఆయన సరసన పూజాహెగ్డే - నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ప్రధాన కథాంశంగా చిత్రం తెరకెక్కుతోంది.
అయితే ఎన్ని చెప్పుకున్నా ఇందులో చరణ్ పాత్ర ఎంతసేపు ఉంటుంది..గెస్ట్ రోల్ లో కనిపిస్తాడా అనే విషయం అంతటా చర్చనీయాశంగా మారింది. కొద్ది కాలం క్రితం వరకూ ఈ సినిమాలో చరణ్ అటుఇటుగా 25 నిమిషాలు కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా ట్రేడ్ లో బిజినెస్ పరంగా ఆ క్యారక్టర్ గురించి తెలుసుకుని లెక్కలు వేసుకోవటానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఈ ఎలిమెంట్ పై దర్శకుడు కొరటాల శివ స్పందించాడు. ఆచార్యలో సిద్ధ పాత్ర సినిమాలో సెకెండాఫ్ మొత్తం కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.
కొరటాల శివ మాట్లాడుతూ.."చరణ్ ది చాలా ముఖ్యమైన పాత్ర. ఇంకా చెప్పాలంటే ఆచార్యలో మెయిన్ ఎమోషన్ చరణ్ దే. అంతే తప్ప ఏదో క్యామియోలా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. చరణ్ ది పెట్టాలని పెట్టిన పాత్ర కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఆచార్య అనేది చరణ్ కథ. మెయిన్ పార్ట్ చరణ్ దే. ఇక నిడివి విషయానికొస్తే.. చరణ్ సెకండాఫ్ అంతా ఉండొచ్చు. సినిమాలో చిరంజీవి-చరణ్ తండ్రికొడుకులు కాదు." అన్నారు.
ఇక చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థలు తొలుత భావించాయి. అయితే ఈ మధ్య కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అందుకే సినిమాని చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జులై మధ్యలోనూ విడుదల చేస్తారనే మరో వార్త కూడా వినిపిస్తోంది. మొత్తం మీద సినిమా విడుదల గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా.. తిరు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. చిత్రంలో సోనూ సూద్, అజయ్, తనికెళ్ల భరణి, కిశోర్ తదితరులు నటిస్తున్నారు.