ఫ్యాన్స్ కి రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్... గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్!

Published : Mar 26, 2024, 12:36 PM IST
ఫ్యాన్స్ కి రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్... గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్!

సారాంశం

రామ్ చరణ్ జన్మదినం పురస్కరించుకుని ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ సిద్ధం చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ నుంచి కీలక అప్డేట్ ఇచ్చారు.   

ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ ఇమేజ్ ఎల్లలు దాటేసింది. ఆయనకు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఇచ్చేశారు. దీంతో ఆయన అప్ కమింగ్ చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేశం మెచ్చిన దర్శకుల్లో ఒకరైన శంకర్ తో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్. రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. పీరియాడిక్ రోల్ లో ఆయన నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. మరో పాత్రలో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అట. 

గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం. కాగా ఈ మూవీ నుండి మొదటి సాంగ్ రేపు విడుదల చేస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే. ఆయన 39వ ఏట అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి' సాంగ్ విడుదల చేస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఈ సాంగ్ విడుదల కానుంది. ఎస్ ఎస్ థమన్ ఈ సాంగ్ స్వరపరిచారు. గేమ్ ఛేంజర్ అప్డేట్ పై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. వీరి కాంబోలో ఇది రెండవ చిత్రం. దిల్ రాజు నిర్మిస్తుండగా సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక రోల్స్ చేస్తున్నారు. కాగా నెక్స్ట్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానతో చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 16వ చిత్రంగా తెరకెక్కుతుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 

అలాగే ఆర్సీ 17 కూడా ప్రకటించారు. రంగస్థలం కాంబో రిపీట్ చేస్తూ సుకుమార్ తో మరోసారి రామ్ చరణ్ చేతులు కలపనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. గేమ్ ఛేంజర్ విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఆర్సీ 16 త్వరలో పట్టాలెక్కనుంది. ఆర్సీ 17 సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు