ఎయిర్ పోర్టులో ప్రత్యక్ష్యం అయిన రామ్ చరణ్... ప్రయాణం ఎక్కడికి..?

Published : Aug 18, 2023, 09:21 AM IST
ఎయిర్ పోర్టులో ప్రత్యక్ష్యం అయిన  రామ్ చరణ్... ప్రయాణం ఎక్కడికి..?

సారాంశం

సడెన్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్ష్యం అయ్యాడు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నవ్వుకుంటూ.. మీడియాను పలుకరిస్తూ.. వెళ్లిపోయారు.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్తున్నారు. 

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...సడెన్ గా ఎయిర్ పోర్ట్ లోకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? షూటింగ్ కు వెళ్తున్నారా...? ఏదైనా వెకేషన్ కోసం ఫారెన్ వెళ్తున్నారా.. ఇలా రకరకాల డౌట్స్ వస్తున్నాయి. నెటిజన్లకు. మరి ఇంతకీ మెగా పవర్ స్టార్ ఎటు వెళ్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విన్నింగ్ తరువాత  గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్..  ప్రస్తుతం శంకర్ తో.. ఆతరువాత బుచ్చిబాబుతో.. ఇలా రామ్ చరణ్ పక్కా ప్లాన్ తో వెళ్తున్నాడు. ఇప్పడైతే.. శకంర్  డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకూ ఆగిపోయి ఉన్నా.. ప్రస్తుతం మాత్రం పరుగులు పెడుతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా మూవీ టీమ్ షూటింగ్ ను ఇంకా  స్పీడ్ అప్ చేసింది. 

వచ్చే ఏడాది స్టార్టింగ్ లో కాని.. సమ్మర్ లో కాని ఈమూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత  దిల్ రాజు.  అయితే చరణ్ తన ఫ్యామిలీ కోసం ఓమూడు నెలలు గ్యాప్ తీసుకోవడంతో.. గేమ్ ఛేంజర్ షూటింగ్ కు లాంగ్ బ్రేక్ పడింది. అయితే ఈగ్యాప్ లో శంకర్ ఇండియాన్ 2 సినిమాను కంప్లీట్ చేశాడు.  రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ ను పరులుగు పెట్టిస్తున్నాడు. తన పూర్తి టైమ్ ను ఈసినిమా కోసమే కేటాయిస్తున్న చరణ్... తాజాగా షూటింగ్ కోసం వెళుతూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరాల కంటబడ్డాడు. 

కంప్లీట్ బ్లాక్ డ్రస్ లో మెరిసిపోతున్నాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్. తనకిష్టమైన బ్లాక్ డ్రస్ లో  రామ్ చరణ్ లాంజ్ లోకి వెళుతూ దర్శనమిచ్చాడు. చేతిలో ల్యాపీ బ్యాగ్, కళ్లకు గాగుల్స్ తో ఉన్న రామ్ చరణ్... మీడియాను చూస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. మీడియాను పలకరిస్తూ..  లోపలికి వెళ్లాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమూవీ షూటింగ్ కోసమే రామ్ చరణ్ వెళ్లినట్టు సమాచారం. మరి ఎక్కడికి వెళ్ళాడు అనేది మాత్రం క్లారిటీ లేదు. 

ఇక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న  గేమ్ ఛేంజర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్  గా నటిస్తోంది. రామ్ చరణ్ తో గతంలో వినయ విధేయ రామ సినిమాలో నటించింది బ్యూటీ. రెండో సారి నటిస్తోంది. ఇక ఈమూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో ఈ ఇద్దరు స్టార్లతో పాటు.. అంజలీ, సునిల్, శ్రీకాంత్. జయరాం లాంటి స్టార్ కాస్ట్ దర్శనం ఇవ్వబోతున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే