
డిఫెన్స్ అధికారులు నిర్వహించిన యుద్ద వీరుల నివాళుల కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ పాల్గోన్నారు. యుద్ద వీరులకు చరణ్ నివాళులు అర్పించారు. వీరుల స్తూపం దగ్గర పుష్పగుచ్ఛం అందించాడు.ఆతరువాత రామ్ చరణ్ స్పూర్తిదాయకంగా మట్లాడారు. ప్రతీ ఒక్కరి మరసు కదిలేలా స్పీచ్ ఇచ్చారు చరణ్. మెగా హీరో మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను, అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని, దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాలి అని అన్నారు.
అంతే కాదు ధృవ సినిమాలో ఆర్మీ అధికారిగా నటించడం గర్వంగా ఉందన్న రామ్ చరణ్... మనం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దేశ సైనికుల త్యాగాలే కారణమన్నారు. మనం నడిచే నేల, పీల్చే గాలి, బతుకుతున్న దేశం మీద వీర జవాన్ల చెరగని సంతకం ఉంటుంది. వీరుల త్యాగాలను ఎవరూ మరిచిపోవద్దు అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇఛ్చారు మెగా పవర్ స్టార్.
రామ్‌చరణ్ రీసెంట్ గా అమృత్ సర్ లో శంకర్ మూవీ షూటింగ్ చేసుకున్ని వచ్చారు. అక్కడ కూడా జవన్లతో కలిసి టైమ్ స్పెండ్ చేశారు చరణ్. ఈరోజు ఆచార్య ప్రి రిలీజ్ లో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటించి,నిర్మించిన ఆచార్య రిలీజ్ హడావిడిలో ఉన్నాడు చరణ్. దాంతో శంకర్ సినిమాకు కొంచెం గ్యాప్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య మూవీకి కొరటాల శివ దర్వకత్వం వహించాడు.
ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో సిద్ద అనే కీలకపాత్రలో నటించాడు. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ జోడీగా నటించగా..పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈమూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయి పాటుల, టీజర్, ప్రమోషన్ వీడియోస్ తో పాటు ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఆచార్యను ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.