SVP Title Song Release : ‘సర్కారు వారి పాట.. తిరులేని బాట’.. దుమ్ములేచిపోయేలా టైటిల్ సాంగ్..

Published : Apr 23, 2022, 12:49 PM ISTUpdated : Apr 23, 2022, 12:50 PM IST
SVP Title Song Release : ‘సర్కారు వారి పాట.. తిరులేని బాట’.. దుమ్ములేచిపోయేలా టైటిల్ సాంగ్..

సారాంశం

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం మ్యూజిక్ ట్రాక్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. తాజాగా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  

దర్శకుడు పరుశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా Sarkaru Vaari Paata. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మోస్ట్ అవెయిటెడ్ చిత్రాన్ని సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman) అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. గతంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయినా కళావతి (Kalaavathi) సాంగ్ ఎంత సెన్సేషనల్ అయ్యింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యన రిలీజ్ అయినా  సెకండ్ సింగిల్ ‘పెన్నీ’ కూడా సంగీత ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది.

కాగా, తాజాగా సర్కారు వారి పాట నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్. మొదట్లో ఈ చిత్రం గ్లింప్స్, మోషన్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడే టైటిల్ సాంగ్ పై అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ కావడంతో సంతోషిస్తున్నారు. టైటిల్ సాంగ్ కు ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ (Anantha Sriram) మాస్ లిరిక్స్ ను అందించారు. థమన్ క్యాచీ ట్యూన్ అందించగా.. సింగఱ్ హారిక నారయణ్ అద్భుతంగా పాడారు. ‘సర సర సర సర్కారు వారి పాట.. తిరుగులేని బాట’ అంటూ సాగే  టైటిల్ ట్రాక్ వినసొంపుగా ఉంది. ప్రస్తుతం య్యూటూబ్ లో దూసుకుపోతోంది. 

బ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురామ్ పెట్ల అద్భుతంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించగా వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ యేర్నెని, వై రవి శంకర్, రామ్ అచంట, గోపీ అచంట నిర్మాతలుగా వ్యవహరించారు. మే 12న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుందీ చిత్రం. 

 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌