#RC16 లో చరణ్ క్యారక్టరైజేషన్,స్లాంగ్?ఆ నవలా రచయిత సాయిం

By Surya Prakash  |  First Published Feb 2, 2024, 7:58 AM IST

 రంగస్దలం చిత్రం అచ్చమైన  గోదావరి యాసలో మాట్లాడిన ఆయన ఈ సినిమాలోనూ ఉత్తరాంధ్ర యాసతో ఆకట్టుకోనున్నారు. అందుకోసం రామ్ చరణ్ హోమ్ వర్క్ చేయబోతున్నారు.

Ram Charan as an Uttarandhra sportsman in #RC16 jsp


ఇప్పుడందరి దృష్టీ రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రంపై ఉంది.   ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న  ఈ సినిమా కోసం ఉత్తరాంధ్ర నుంచి ఏకంగా 400 మందిని తీసుకోనున్నారు.అనగానే అందరి దృష్టీ అటు మరిలింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం జానర్ ఏమిటి.అసలు హీరో ఈ సినిమాలో ఏ పాత్ర చేయబోతున్నారు. మిగతా విశేషాలు కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మీకు అందిస్తున్నాము.

 రామ్ చరణ్ తన తాజా చిత్రం  గేమ్ ఛేంజర్ షూట్ లో బిజీగా ఉంటూనే.. తన నెక్ట్స్ మూవీని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో చేయనునాన్నారు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కించనున్నారు. అలాగే రామ్ చరణ్ ఉత్తరాంధ్రకు చెందిన స్పోర్ట్స్ పర్శన్ గా కనిపించనున్నారు. అక్కడ స్లాంగ్ నే మాట్లాడనున్నారు. రంగస్దలం చిత్రం అచ్చమైన  గోదావరి యాసలో మాట్లాడిన ఆయన ఈ సినిమాలోనూ ఉత్తరాంధ్ర యాసతో ఆకట్టుకోనున్నారు. అందుకోసం రామ్ చరణ్ హోమ్ వర్క్ చేయబోతున్నారు. డైలాగులు విషయంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ ప్రముఖ నవలా రచయిత సాయిం చేస్తున్నట్లు వినికిడి. ఏప్రియల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.

Latest Videos

అలాగే  ఈ  సినిమాలో సీనియర్ నటి లయ కూడా నటించనుంది. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు ఆ మధ్య డైరెక్టర్ బుచ్చిబాబే బిగ్ బాస్ తెలుగు షోలో వెల్లడించాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మూవీలో స్టార్ హీరోయిన్ అలియాభట్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో 'RRR' వచ్చి సూపర్ హిట్టైంది. దాంతో ఆమెను బుచ్చిబాబు సనా అడిగినట్లు ,డిస్కషన్స్ జరుగుతున్నట్లు వినికిడి. నిర్మాతలు ముంబై వెళ్లి ఆమెతో నెగోషియోషన్స్ చేస్తున్నారని, మాగ్జిమం ఓకే కావచ్చు అని అంటున్నారు.

రెండేళ్ల క్రితం వచ్చిన  'RRR'లో చేసినప్పుడు ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడిందని, దాంతో స్క్రీన్ పై ఏ ఇబ్బంది లేకుండా ఈ జంట కెమిస్ట్రీ పండుతుందని భావించి దర్శక,నిర్మాతలు ఆమెను ఎప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. రామ్ చరణ్, అలియా భట్ కాంబో అయితే ప్రొపిషనల్ గా ఉంటుందని , షూటింగ్ టైమ్ లోనూ తమ పని ఈజ్ గా అయ్యిపోతుందని దర్శకుడు భావిస్తున్నారట. అయితే అదే సమయంలో అలియా కనుక నో చెప్తే సాయి పల్లవి ని సీన్ లోకి తెచ్చే అవకాసం ఉందంటున్నారు.  

  రంగస్దలం ను మించిన మేకోవర్ తో ఫిల్మ్ తెరకెక్కించబోతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం.  కాగా కన్నడ స్టార్ శివ రాజ్‌‌కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట.   పూర్తి వివరాలను బుచ్చిబాబు అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.   

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image