FormulaE రేసులో రాంచరణ్‌, ఉపాసన సందడి, వైరల్ అవుతున్న ఫోటోస్

Published : Dec 11, 2022, 09:41 PM IST
FormulaE రేసులో రాంచరణ్‌, ఉపాసన సందడి, వైరల్ అవుతున్న ఫోటోస్

సారాంశం

రామ్ చరణ్ - ఉపాసన ఫార్ములా ఈ రేస్ లో సందడి చేశారు. స్టైలీష్, హ్యాండ్సమ్ లుక్ లో సందడి చేశారు మెగా జంట.   

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -- ఉపాసన  హైదరాబాద్‌లో నిర్వహించిన FormulaE Raceలో సందడి చేశారు. స్టైలిష్, హ్యాండ్ సమ్‌ బ్లాక్ జాకెట్‌ లుక్‌లో రాంచరణ్‌, బ్లూ డ్రెస్‌లో ఉపాసన స్టైలిష్ గాగుల్స్‌తో ఫార్ములా ఈ రేసు లో సందడి చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. 


మెగా హీరో రాంచరణ్‌ ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్ ఆర్‌సీ 15 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. రీసెంట్ గా చరణ్  న్యూజిలాండ్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. మెగా పవర్ స్టార్ అభిమానులు  ఆర్‌సీ 15 సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఎస్ థమన్ ఈ సినిమాకు  సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెగాపవర్‌ స్టార్ రాంచరణ్ . ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచేసుకున్నాడు. ఈ మూవీ  రాంచరణ్‌కు  ఫారెన్  ఆడియన్స్ ను సాధించి పెట్టింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వల్ల పెరిగిన క్రేజ్‌తో పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌ లో భాగస్వామిగా మారిపోయాడు రాంచరణ్‌. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే రాంచరణ్‌ టైం దొరికినపుడల్లా ఉపాసన ‌తో కలిసి హడావిడి చేస్తుంటారు. ఈమధే ఇద్దరు టాంజానియా లో పుల్ గా ఎంజాయ్ చేసి వచ్చారు. 

 

ఇక ఇప్పుడు ఇద్దరు ఫార్ములా ఈ రేస్ లో హడావిడి  చేశారు. మెగా జంట రావడంతో అక్కడ అంతా సందడి వాతావరణం ఏర్పడింది. ఇక పొలిటికల్‌ థ్రిల్లర్ జోనర్‌ నేపథ్యంలో  శంకర్ తో తెరకెక్కుతున్న ఆర్ సీ 15 మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, నవీన్‌ చంద్ర, సముద్రఖని,ఎస్‌జే సూర్య కీలక  పాత్రల్లో నటిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?