రామ్ చరణ్ ‌- ఉపాసన కు సర్ ప్రైజ్ ఇచ్చిన ఎన్టీఆర్, మెగావారసురాలికి అదిరిపోయే గిఫ్ట్ పంపిన తారక్.

Published : Jul 19, 2023, 10:33 AM IST
రామ్ చరణ్ ‌- ఉపాసన కు సర్ ప్రైజ్ ఇచ్చిన ఎన్టీఆర్, మెగావారసురాలికి అదిరిపోయే గిఫ్ట్  పంపిన తారక్.

సారాంశం

రామ్ చరణ్ , ఉపాసనల వారసురాలికి అదిరిపోయే బహుమతి పంపించాడట.. యంగ్ టైగర్.. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్. ఇంతకీ తారక్ ఏం బహుమతి పపించాడు....? 

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల బంధం  బలపడింది.  ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. అంతే కాదు ఇద్దరి మధ్య స్నేహాన్ని మించిన బంధం బలపడింది. దాంతో రెండు  కుటుంబాల మధ్య ఏ అకేషన్ జరిగినా.. విష్ చేసుకోవడంతో పాటు.. బహుమతులు కూడా పంపించుకోవడం స్టార్ట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ తో ఇద్దరు హీరోలు గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ఇండియాలోనే కాదు..హాలీవుడ్ రేంజ్ లో ఇద్దరి పేరు మారుమోగిపోయింది. ప్రస్తుతం ఇద్దరు హీరోలు చెరికో పాన్ ఇండియా సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. 

ఈమధ్యే రామ్ చరణ్, ఉపాసన తల్లి తండ్రుల అయ్యారు.  మెగా ఫ్యామిలీలో.. వారసురాలు పుట్టింది. చరణ్, ఉపాసనల గారాల పట్టికి క్లింకారా అని పేరు పెట్టారు చిరంజీవి. లలిత సహస్రనామాలలోని బీజాక్షరాన్ని పేరుగా పెట్టినట్టు ప్రకటించారు. చిన్నారి రాకతో మెగా ప్యామిలీలో సందడి వాతావరణం.. పండగ వాతావరణం నెలకొంది.  ఇక ఈక్రమంలో తాజాగా.. రామ్ చరణ్ - ఉపాసనల గారాల పట్టి కోసం సూపర్ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

క్లింకారా కోసం.. ఎన్టీఆర్ గోల్డ్ డాలర్స్ ను బహుమతిగా పంపించారట. ఆ డాలర్స్ మీద రామ్ చరణ్, ఉపాసన, క్లింకారాల పేర్లు వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడట తారక్. ఈ బహుమతితో మెగా ఫ్యామిలీ దిల్ ఖుషీ అయ్యారట. అంతే కాదు రామ్ చరణ్ తనకు పాప పుట్టగానే తారక్ కు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంతోషాన్ని పంచుకున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం తారక్ కొరటాల శివతో దేవర సినిమా చేస్తుండగా.. అటు రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. తారక్ నెక్ట్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు. చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే