మెగా ఫ్యాన్స్ కి సైరా అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

Published : Aug 13, 2019, 04:52 PM IST
మెగా ఫ్యాన్స్ కి సైరా అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉంది.    

రామ్ చరణ్ ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ తో మాట్లాడుతూ సినిమా పనులన్నీ వీలైనంత త్వరగా అయిపోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ మేకింగ్ వీడియోను అభిమానులకు అందించబోతున్నాడు చరణ్. గత కొంత కాలంగా మెగా అభిమానులు సైరా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

మొత్తానికి వారిని ఎట్రాక్ట్ చేసే విధంగా చరణ్ సైరా మేకింగ్ వీడియోను ఆగస్ట్ 15 కంటే ఒక రోజు ముందే బుధవారం (సమయం 3:45PM) రిలీజ్ చేయబోతున్నాడు. రెండేళ్లు చిత్ర యూనిట్ సినిమా కోసం కష్టపడిన దృశాలను చూడవచ్చని ఇదొక గొప్ప అనుభూతి అని చరణ్ పేర్కొన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరా కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్ యాక్టర్స్ నటించిన ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది